Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్ రిలీఫ్.. పెరుగుదలకు బ్రేక్.. లేటెస్ట్ ధరలు ఇలా..

పెట్రోల్, డీజిల్ ధరలపై వాహనదారులకు బిగ్ రిలీఫ్ లభించింది. బుధవారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో ఇంధన ధరలు రెండుసార్లు పెరిగాయి. మంగళవారం కూడా పెరగ్గా.. బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ధరల పెంపు నుంచి కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు.

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్ రిలీఫ్.. పెరుగుదలకు బ్రేక్.. లేటెస్ట్ ధరలు ఇలా..
Petrol Prices

Updated on: May 20, 2026 | 12:21 PM

వారం రోజుల్లో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులతో పాటు సామాన్యులపై ప్రభావితం చూపిస్తున్నాయి. దీంతో ఇంధన ధరలు మరింత పెరగుతాయనే వార్తల క్రమంలో బుధవారం కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం లీటర్ పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరగ్గా.. బుధవారం కాస్త శాంతించాయి. దేశవ్యాప్తంగా కొత్త ధరలను చమురు కంపెనీలు ప్రకటించాయి. ఉదయం 6 గంటలకు కంపెనీలు తాజా ధరలను విడుదల చేస్తూ ఉంటాయి. లేటెస్ట్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో ధరలు స్ధిరంగా ఉన్నాయని చెప్పవచ్చు.

వివిధ నగరాల్లో ధరలు ఇలా..

-ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.64 వద్ద కొనసాగుతోండగా.. డీజిల్ రేటు రూ.91.58 వద్ద ఉంది.

-ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.111.88 వద్ద ఉండగా.. డీజిల్ రూ.99.95 పలుకుతోంది.

-ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.104.46, డీజిల్ రూ.96.11 వద్ద ఉంది.

-బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.107.12 వద్ద ఉండగా.. డీజిల్ రూ.95.04 వద్ద కొనసాగుతోంది.

-ముంబైలో పెట్రోల్ రూ.107.59, డీజిల్ రూ.94.08గా ఉంది.

-కోల్ కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.70 వద్ద ఉండగా.. డీజిల్ రూ.96.07 వద్ద కొనసాగుతోంది.

-గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ రూ.99.29 వద్ద కొనసాగుతోండగా.. డీజిల్ రూ.91.80 వద్ద ఉంది.

-నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.91 వద్ద ఉండగా.. డీజిల్ రూ.92.91గా కొనసాగుతోంది

వారం రోజుల్లో రెండుసార్లు..

వారం రోజుల్లో ఏకంగా రెండుసార్లు ధరలు పెరగడంతో సామాన్యుల జేబుపై భారం పడుతోంది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. అలాగే వాహనదారులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అయితే మీరు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను సులువుగా ప్రతీ రోజు చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP సిటీ కోడ్ టైప్ చేసి 9224992249 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. ఇక బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కస్టమర్లు RSP అని టైప్ చేసి 9223112222 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. కాగా వారం రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై రూ.4 మేర పెరిగాయి. ఈ నెల 15వ తేదీన లీటర్‌పై రూ.3 మేర పెంచగా.. మే 19వ తేదీన 90 పైసలు పెంచాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగుతుండగా.. కొంతకాలంగా చమురు కంపెనీలు ధరలను స్ధిరంగా ఉంచాయి. దీని వల్ల కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో నష్టాల నుంచి తప్పించుకునేందుకు వారంలో రెండుసార్లు ధరలను పెంచాయి. ఈ పెంపు వల్ల నష్టాలు తగ్గినప్పనటికీ.. ఇంకా ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. దీంతో ధరలు మరింత పెరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Follow Us