Petrol, Diesel Price Today: ముడి చమురు ధరలో పతనం.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

|

Jul 15, 2023 | 8:03 AM

దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం పెట్రోల్, డీజిల్ కొత్త ధరను నిర్ణయిస్తాయి. జూలై 15న అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు రేట్లు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్, డబ్ల్యుటిఐ క్రూడ్ ఆయిల్ రెండూ రెడ్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి..

Petrol, Diesel Price Today: ముడి చమురు ధరలో పతనం.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
Petrol Price
Follow us on

దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం పెట్రోల్, డీజిల్ కొత్త ధరను నిర్ణయిస్తాయి. జూలై 15న అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు రేట్లు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్, డబ్ల్యుటిఐ క్రూడ్ ఆయిల్ రెండూ రెడ్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి.
బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 1.91 శాతం భారీ క్షీణతతో $ 75.42 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 1.83 శాతం క్షీణతతో $ 79.87 వద్ద ట్రేడవుతోంది. కొన్ని నగరాల్లో మాత్రమే ధరల్లో మార్పులున్నాయి.

దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాలు చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపు కనిపిస్తోంది. శనివారం పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 9 పైసలు తగ్గగా లీటరుకు వరుసగా రూ.102.63, రూ.94.24 చొప్పున లభిస్తున్నాయి. ఇది కాకుండా, దేశ రాజధానిలో ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక్కడ రూ. 96.72, రూ.89.62 వద్ద కొనసాగుతోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో కూడా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ రూ. 106.03, రూ. 92.76గా ఉన్నాయి. ఇక తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 109.66 రూపాయలు 97.82 రూపాయలుగా ఉంది.

వినియోగదారుల సౌకర్యార్థం ఆయిల్ కంపెనీలు కేవలం మెసేజ్‌ల ద్వారానే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను చెక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. BPCL కస్టమర్‌లు ని 9223112222కి, ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP ని 9224992249 మెసేజ్‌ పంపాల్సి ఉంటుంది. అలాగే HPCL కస్టమర్‌లు HPPRICE ని 9222201122 మెసేజ్‌ చేస్తే ధరలు వస్తాయి. దీని తర్వాత మీరు కొన్ని నిమిషాల్లో కొత్త ధరలను తెలుసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి