Petrol Diesel Price: గత కొన్ని రోజుల క్రితం వరకు పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు ఇటీవల కాస్త బ్రేక్ పడింది. దీంతో ధరలు పెరగకుండా వాహనదారులకు ఊరట కలిగిస్తున్నాయి. అంతేకాకుండా స్వల్పంగా ధరలు తగ్గడంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం కూడా లభించింది. ఇక తాజాగా మంగళవారం కూడా దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో పెద్దగా మార్పుల కనిపిచంలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల మాత్రం పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి..
► దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.49 గా ఉండగా, డీజిల్ రూ. 88.92 వద్ద కొనసాగుతోంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.52 ఉండగా, డీజిల్ రూ. 96.48 గా ఉంది.
► తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.20 గా ఉండగా, డీజిల్ ధర రూ. 93.52 వద్ద కొనసాగుతోంది.
► కర్ణాటకల రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 104.98 కాగా, డీజిల్ ధర రూ. 94.34 గా ఉంది.
► హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 105.54 గా ఉండగా, డీజిల్ రూ. 96.99 గా ఉంది.
► వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.06 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.53గా ఉంది.
► మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.64గా ఉండగా, డీజిల్ ధర రూ.97.09గా ఉంది.
►రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54 ఉండగా, డీజిల్ ధర రూ.96.99గా ఉంది.
► విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.67 గా ఉండగా, డీజిల్ ధర రూ. 98.62 వద్ద కొనసాగుతోంది.
► విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.73 కాగా, డీజిల్ రూ. 97.70 గా నమోదైంది.
► కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.12గా ఉండగా, డీజిల్ ధర రూ.98.51గా ఉంది.
► గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.77 ఉండగా, డీజిల్ ధర రూ.98.71ఉంది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం తగ్గుదలతో 71.90 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.47 శాతం క్షీణతతో 68.89 డాలర్లకు తగ్గింది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.