Petrol Price Today: పెరుగుతోన్న ఇంధన ధరలకు చెక్‌.. వరుసగా రెండో రోజు స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు..

| Edited By: Ravi Kiran

Mar 22, 2021 | 1:19 PM

Petrol Price Today: పెట్రోల్‌, డీజీల్‌ కొట్టించాలంటే వాహనదారులు భయపడే పరిస్థితి వచ్చింది. రూ.90కి చేరువైన పెట్రోల్‌ ధరలు రూ. వందకు చేరుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టదని అందరూ భావించారు. కానీ కొంతలో కొంత సామాన్యుడికి...

Petrol Price Today: పెరుగుతోన్న ఇంధన ధరలకు చెక్‌.. వరుసగా రెండో రోజు స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు..
Petrol Price Today
Follow us on

Petrol Price Today: పెట్రోల్‌, డీజీల్‌ కొట్టించాలంటే వాహనదారులు భయపడే పరిస్థితి వచ్చింది. రూ.90కి చేరువైన పెట్రోల్‌ ధరలు రూ. వందకు చేరుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టదని అందరూ భావించారు. కానీ కొంతలో కొంత సామాన్యుడికి ఉపశమనం కనిపిస్తోంది. గత రెండు రోజులుగా పెట్రోల్‌, డీజీల్‌ ధరల్లో పెరుగుదల లేకపోయే సరికి కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

ఢిల్లీలో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా ( సోమవారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (సోమవారం రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (సోమవారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (సోమవారం రూ.88.60 )గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం కూడా పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (సోమవారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (సోమవారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం కరీంనగర్‌లోనూ ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.92 (సోమవారం రూ. 94.91 ), డీజిల్‌ రూ. 88.97 (సోమవారం రూ. 88.96 )గా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.39 (సోమవారం రూ.97.28), డీజిల్‌ ధర రూ. 90.91 (సోమవారం రూ.90.79) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో క్రమంగా రెండో రోజు కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.41 (సోమవారం రూ. 96.13 )గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 89.95 (సోమవారం రూ.89.69 )గా వద్ద కొనసాగుతోంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.11 ఉండగా (సోమవారం రూ. 93.11 ), డీజిల్‌ ధర రూ. 86.45 (సోమవారం రూ. 86.51 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (సోమవారం రూ. 94.29 ), ఉండగా డీజిల్‌ ధర రూ.86.37 (సోమవారం రూ. 86.42 ) గా ఉంది.

Also Read: Honda CB 500X: కొత్త అడ్వెంచర్‌ బైక్‌ను లాంచ్‌ చేసిన హోండా… ధర ఎంతో తెలిస్తే అవాక్కావ్విల్సిందే..

జనరిక్ ఆధార్ యాప్‌ను ప్రారంభించిన రతన్ టాటా.. మెడిసిన్‌కి సంబంధించి ఏఏ సేవలు లభిస్తాయంటే..

వినియోగదారులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. 120 రోజుల ముందుగానే పార్శిల్‌ బుక్‌ చేసుకునేందుకు వీలు..!