Petrol Price Today: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు.. సామాన్యులకు కాస్త ఉపశమనం.. ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..

|

Mar 04, 2021 | 8:02 AM

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యులపై పెను భారంగా మారుతున్నాయి. మరో వైపు పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్టు పెట్రోల్ ధర పై పైకి వెళ్తుంది.

Petrol Price Today: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు.. సామాన్యులకు కాస్త ఉపశమనం.. ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..
Follow us on

Petrol Price : భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యులపై పెను భారంగా మారుతున్నాయి. మరో వైపు పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్టు పెట్రోల్ ధర పై పైకి వెళ్తుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గకపోయినప్పటికీ  గురువారం స్థిరంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలలో హెచ్చుతగ్గులు  కనిపిస్తున్నాయి . దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూదాం ..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.179 (బుధవారం రూ.91.17 ) ఉండగా, డీజిల్‌ ధరూ.81.47 (బుధవారం రూ.81.47 ) వద్ద కొనసాగుతున్నాయి. అలాగే  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 ఉండగా (బుధవారం రూ.97.57 ), డీజిల్‌ రూ.88.60 (బుధవారం రూ.88.60 )గా నమోదైంది. ఇక కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.35 ఉండగా (బుధవారం రూ.91.35 ), డీజిల్‌ రూ.84.35 (బుధవారం రూ.84.35)గా ఉంది.

అదే విధంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే గురువారం పెట్రోల్‌ ధరపెరగక పోవడంతో కాస్త ఉపశమనం లభించింది. భాగ్యనగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.94.79 గా ఉండగా (బుధవారం రూ.97.79 ), డీజిల్‌ రూ.88.86 ( బుధవారం రూ.88.86 ) వద్ద కొనసాగుతోంది.  వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.37 గా నమోదుకాగా (బుధవారం రూ.94.37 ), డీజిల్‌ రూ.88.45 వద్ద (బుధవారం రూ.88.45 ) కొనసాగుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.39 (బుధవారం రూ.97.50) ఉండగా.. లీటర్‌ డీజిల్‌ రూ.90.91  (బుధవారం రూ.91.01) వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.41 గా ఉండగా (బుధవారం రూ.96.68 ), డీజిల్‌ రూ.89.95 గా (బుధవారం రూ.90.20) నమోదైంది. ఇక  చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.11 ఉండగా (బుధవారం రూ.93.11 ), డీజిల్‌ రూ.86.53 గా (బుధవారం రూ.86.53 ) నమోదైంది. బెంగళూరులో గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 ఉండగా( బుధవారం రూ.94.22), డీజిల్‌ ధర రూ.86.37 వద్ద కొనసాగుతోంది( బుధవారం రూ.86.37).

మరిన్ని  ఇక్కడ చదవండి :