Petrol And Diesel Rates: ఏప్రిల్ ఫస్ట్ సామాన్యులకు గుడ్ న్యూస్ తెచ్చింది.. పరుగుల పెట్టిన పెట్రో ధరలకు బ్రేక్ పడింది. ఆర్ధిక సంవత్సరం తొలి రోజు దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరగలేదు. పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది సమాన్యులకు పెద్ద ఊరట నిస్తోంది. ప్రతి రోజు పెరగుతున్న పెట్రోల్ ధరలకు గత కొద్ది రోజులుగా బ్రేక్ పడటం ఆనందాన్ని ఇస్తోంది.
పెట్రో ధరలు…
దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.56 (బుధవారం 90.56) ఉండగా.. డీజిల్ ధర రూ.80.87(బుధవారం 80.87) వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.98గా(బుధవారం 96.98) ఉండగా డీజిల్ రూ. 87.96గా (బుధవారం 87.96)ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులో పెట్రోల్ ధర 93.59 (బుధవారం 93.59)గాఉండగా.. డీజిల్ ధర 85.75(బుధవారం 85.75) ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.58(బుధవారం 92.58)గా ఉండగా.. డీజిల్ ధర రూ. 85.88 (బుధవారం 85.88)గా ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.16(బుధవారం 94.16)గా ఉండగా.. డీజిల్ రూ. 88.20 (బుధవారం88.20)వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో మరో ముఖ్యమైన పట్టణమైన కరీంనగర్‌లోనూ ధరల విషయంలో స్వల్ప మార్పు కనిపించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 93.04(మంగళవారం 93.92)గా ఉండగా.. డీజిల్ ధర రూ. 88.08(బుధవారం 88.97)గా నమోదైంది. విజయవాడలో ధరల్లో స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 96.67 (బుధవారం రూ.96.67) కాగా డీజిల్ ధర రూ. 90.16గా(బుధవారం 90.92) నమోదైంది… సాగర నగరం విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 95.80 (బుధవారం రూ.95.85) గా డీజిల్ ధర రూ. 89.19(మంగళవారం 89.62)గా నమోదైంది.