Credit Card Bill: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నారా? మీకున్న ఆప్షన్స్ ఇవే..!

క్రెడిట్ కార్డు వాడని వాళ్లు ఈ రోజుల్లో చాలా తక్కువమందే ఉంటారు. ఒకసారి క్రెడిట్ కార్డు వాడడం మొదలుపెడితే.. నెలనెలా వాడకం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఇలా కొంతకాలానికి క్రెడిట్ కార్డులు, వాటి బిల్లులు పెరిగి కట్టలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతుంటారు చాలామంది. అసలు ఈ పరిస్థితిలో మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటే..

Credit Card Bill: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నారా? మీకున్న ఆప్షన్స్ ఇవే..!
అనేక ఆన్‌లైన్ రిటైలర్లు రెండు-కారకాల ప్రమాణీకరణను అందిస్తారు. ఇది చాలా ముఖ్యమైనది. పాస్‌వర్డ్ కాకుండా, మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు మరొక మార్గాన్ని పొందుతారు. అటువంటి పరిస్థితిలో మీ పాస్‌వర్డ్ ఎవరికైనా తెలిసినప్పటికీ, సందేశం లేదా మెయిల్‌లో వచ్చిన ధృవీకరణ కోడ్ లేకుండా వారు మీ ఖాతాను యాక్సెస్ చేయలేరు.

Updated on: Sep 17, 2025 | 6:12 PM

ఆదాయం సరిపోని పరిస్థితుల్లో కాస్త భరోసాగా ఉంటుందనే ఆలోచనతో చాలామంది క్రెడిట్ కార్డు తీసుకుంటుంటారు. అయితే కొంతకాలానికి క్రెడిట్ కార్డు అనేది ఒక అలవాటుగా మారుతుంది. అవసరంలేని ఖర్చులకు కూడా క్రెడిట్ కార్డును వాడుతూ.. లేనిపోని భారాన్ని పెంచుకుంటుంటారు. లేదా కొన్ని అనుకోని ఖర్చుల వల్ల పేమెంట్ సమయానికి బిల్లు కట్టలేని పరిస్థితి రావొచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..

రిక్వెస్ట్ చెయొచ్చు

అనుకోని ఖర్చుల వల్ల.. అంటే ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వల్ల లేదా ఉద్యోగం రిజైన్ చేయడం వంటి కారణాల వల్ల బిల్లు కట్టలేని పరిస్థితి వస్తే ముందుగా ఆయా క్రెడిట్ కార్డు కంపెనీలకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పొచ్చు. మీ కారణం జెన్యూన్ అనిపిస్తే.. ఆయా మేనేజర్లు వడ్డీ రేటు తగ్గించడం లేదా ఈఎంఐ టెన్యూర్ ని పొడిగించడం లేదా డేట్ మార్చడం వంటి వెసులు బాట్లు కల్పిస్తారు. అయితే ఇది పూర్తిగా కంపెనీ మేనెజర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.

బదులుగా తీసుకుని..

ఒకవేళ బిల్లు కొద్దిమొత్తంలో ఉండి దాన్ని కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు స్నేహితులు లేదా దగ్గరి బంధువుల నుంచి బదులుగా డబ్బు తీసుకుని కట్టడం మరొక ఆప్షన్. అప్పుగా కాకుండా బదులుగా తీసుకుంటేనే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. ఒకవేళ అప్పుగా తీసుకుంటే ఆ వడ్డీ.. క్రెడిట్ కార్డు వడ్డీ కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది.

పర్సనల్ లోన్..

నాలుగైదు క్రెడిట్ కార్డులు ఉండి, వాటి బిల్లులు వేలకు వేలు పెరిగి.. కట్టేందుకు నెలసరి జీతం సరిపోని పరిస్థితుల్లో.. బ్యాంకు నుంచి ఒక పర్సనల్ లోన్ తీసుకుని కార్డు పేమెంట్స్ అన్నీ ఒకేసారి కట్టేయడం మేలు. క్రెడిట్ కార్డు బిల్లుపై పడే వడ్డీ కంటే పర్సనల్ లోన్ పై పడే వడ్డీ తక్కువగా ఉంటుంది. లోన్ ద్వారా కార్డు పేమెంట్స్ అన్నీ క్లియర్ చేసి ఒకటే లోన్ ఈఎంఐగా మార్చుకోవచ్చు.

రొటేషన్ చేయొద్దు

ఇకపోతే..  క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేనప్పుడు మరొక క్రెడిట్ కార్డు లేదా యాప్స్ నుంచి డబ్బు తీసి  అటు ఇటు రోటేషన్ చేస్తుంటారు చాలామంది. దీని వల్ల క్రెడిట్ సైకిల్ పెరుగుతూ పోతుందే తప్ప అసలు అప్పు తీరదు. కాబట్టి అప్పుని అప్పుతో తీర్చడం సొల్యూషన్ కాదని గుర్తుంచుకోవాలి.

డీయాక్టివేట్

ఇక చివరిగా క్రెడిట్ కార్డు వల్ల ఇబ్బందే తప్ప లాభం లేదు అని మీకనిపిస్తే.. వీలైనంత త్వరగా కార్డుల బిల్లులన్నింటినీ చెల్లించి వాటిని క్లోజ్ చేయడం మేలు. అవసరానికి తగ్గట్టు ఒకటి లేదా రెండు కార్డులు అవి కూడా తక్కువ లిమిట్ ఉన్నవి ఉంచుకుంటే అతిగా ఖర్చు చేసే అవకాశం ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..