PPF Scheme: ప్రతి నెలా రూ.11 వేల పెట్టుబడి.. రిస్క్‌ లేకుండా రూ.90 లక్షలు మీ సొంతం! మీరు చేయాల్సిందల్లా..

ఇతర వ్యాపారాలు లేదా పెట్టుబడులలో రిస్క్ అధికం. కానీ, పోస్టాఫీస్ పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) పథకం ఎలాంటి రిస్క్ లేకుండా సంపదను పెంచుకోవడానికి అద్భుతమైన మార్గం. నెలకు రూ.11వేలు పెట్టుబడి పెట్టి, 25 సంవత్సరాలలో రూ.90 లక్షల నిధిని పొందవచ్చు.

PPF Scheme: ప్రతి నెలా రూ.11 వేల పెట్టుబడి.. రిస్క్‌ లేకుండా రూ.90 లక్షలు మీ సొంతం! మీరు చేయాల్సిందల్లా..
Indian Currency

Updated on: Oct 03, 2025 | 6:15 PM

కొంతమంది దగ్గర కొంత డబ్బు ఉంటుంది. దాంతో వ్యాపారం చేయొచ్చు. కానీ, అది సక్సెస్‌ అయితే ఓకే, లేదంటే అంతా పోతుంది. అదే డబ్బును ఎవరికైనా వడ్డీకి ఇవ్వొచ్చు వాళ్లు చెప్పిన టైమ్‌కి తిరిగి ఇస్తే ఓకే, లేదంటే అసలు రావడం కూడా కష్టమే. పోని ల్యాండ్‌ కొనొచ్చు.. భవిష్యత్తులో దానికి ధర పెరిగితే ఓకే అలా కాకుండా కబ్జాకు గురైనా, హైడ్రా లాంటి వాటిలో పోయినా డబ్బంతా పోయినట్టే. ఇలా ప్రతి మార్గంలో రిస్క్‌ అనేది కచ్చితంగా ఉంది. అలా కాకుండా ఏ మత్రం రిస్క్‌ లేకుండా మీ డబ్బు పెరిగి ఏకంగా 90 లక్షలు మీ చేతికి వస్తే ఎలా ఉంటుంది. సూపర్‌ కదా.. మరి అలాంటి అస్సలు రిస్క్‌ లేని స్కీమ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్ పీపీఎఫ్ స్కీమ్.. పెట్టుబడికి పూర్తి హామీతో కూడిన గ్యారెంటీ రిటర్న్స్ అందించే అద్భుతమైన స్కీమ్‌. చాలా మంది తమ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం పీపీఎఫ్ ఒక మంచి పెట్టుబడి ఎంపికగా భావిస్తున్నారు. సేఫ్ రిటర్న్ కోరుకునేవారికి ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ బెస్ట్‌ అని చెప్పాలి. ప్రతి మూడు నెలలకు కేంద్ర ప్రభుత్వం వీటి వడ్డీ రేట్లు మారుస్తూ ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ వస్తుంది.

పీపీఎఫ్ ఖాతాలో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 పెట్టుబడి నుంచి గరిష్ఠంగా రూ.లక్షన్నర వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. పైగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ కింద చేసే పెట్టుబడులకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. 15 ఏళ్లకు ఈ స్కీమ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దానిని పొడిగించుకునేందుకు వీలు ఉంది. మీరు PPF ద్వారా 25 సంవత్సరాల్లో రూ.90 లక్షల నిధిని సృష్టించాలనుకుంటే.. మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ.11వేలు పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి సంవత్సరానికి రూ.1,32,000 వేలు అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వ్యవధిని పొడిగించడానికి మీరు పోస్టాఫీసుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పెట్టుబడి 25 సంవత్సరాలలో రూ.90,71,053 రాబడిని ఇస్తుంది. ఇందులో రూ.33 లక్షల పెట్టుబడి మొత్తం ఉంటుంది. వడ్డీ ఆదాయం రూ.57,71,053 ఉంటుంది.

మరిన్ని పర్సనల్‌ ఫైనాన్స్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి