అన్నదాతను రాజును చేసేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం. దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం.. 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించి.. రైతులకు చేయూతనిస్తోంది. దీని కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా ఏటా రూ. 6 వేల మొత్తాన్ని రైతుల ఖాతాకు పంపుతున్నారు. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలల వ్యవధిలో ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మూడు విడతలుగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాకు బదిలీ చేస్తున్నారు.
అయితే, ఇటీవలే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12వ విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 10 కోట్ల మందికి పైగా రైతులకు 12 వాయిదాలు అందాయి. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ నగదు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12 విడత బదిలీ చేయబడింది. అయితే జనవరి తొలినాళ్లలో 13వ విడత రైతుల ఖాతాల్లోకి రావచ్చు. ఈ రోజుల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల జాబితా నుంచి తమ పేరు కూడా తొలగించబడిందా..? అనే సందేహం రైతులలో నెలకొంది. ఇలాంటి వారు తమ పేరు ఉందా..? లేదా..? అనేది తేలుసుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని చెక్ చేసుకోవచ్చు.
మీరు పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళితే.. అక్కడ ఉండే ఫార్మర్ కార్నర్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవచ్చు. ముందుగా e-KYC, భూమి వివరాలు పూర్తిగా నింపి ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. మీ పీఎం కిసాన్ యోజన స్టేటస్ ముందు ఇలా రాస్తే.. 13వ విడత కచ్చితంగా మీ ఖాతాలోకి వస్తుందని అర్థం చేసుకోండి. అందులో మీ పేరు కనిపించక పోతే మాత్రం మీకు రాకపోవచ్చని అర్థం చేసుకోండి.
మీరు ఇంకా భూమి రికార్డుల వెరిఫికేషన్, e-KYC చేయకుంటే.. మీరు ఈ పథకం ప్రయోజనాలను కోల్పోవచ్చు. 13వ వాయిదాను పొందడానికి.. వీలైనంత త్వరగా e-KYC, భూలేఖ్‌లను ధృవీకరించండి. గతంలో ఈ లబ్ధిదారుల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తుల పేర్లు తొలగించారు.
పీఎం కిసాన్ యోజనకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. మీరు అధికారిక ఇమెయిల్ ఐడి లో సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ యోజన హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 కూడా సంప్రదించవచ్చు. ఈ పథకానికి సంబంధించిన మీ ప్రతి సమస్య ఇక్కడ కూడా పరిష్కరించబడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం