ఈ నెలలో డబ్బులు కావాలా..? పర్సనల్‌ లోన్‌పై ఏ బ్యాంక్‌లో వడ్డీ తక్కువంటే..?

ఈ నెలలో పర్సనల్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే తొందరపడకుండా, వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, EMI, ప్రాసెసింగ్ ఫీజులను పోల్చడం ముఖ్యం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు, అలాగే HDFC, ICICI, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ బ్యాంకుల తాజా వడ్డీ రేట్లను ఇక్కడ పరిశీలించండి.

ఈ నెలలో డబ్బులు కావాలా..? పర్సనల్‌ లోన్‌పై ఏ బ్యాంక్‌లో వడ్డీ తక్కువంటే..?
Indian Currency 2

Updated on: Oct 03, 2025 | 7:45 PM

డబ్బులు ఎవరికి వద్దు చెప్పండి..? ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకంటే.. ఏదో ఒక అవసరం ఉండనే ఉంటుంది. పాపం చాలా మంది అత్యవసరమై అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటూ ఉంటారు. మరి ఈ నెలలో అవసరాలు తీర్చుకోవడానికి ఎవరైనా పర్సనల్‌ లోన్‌ కోసం చూస్తుంటే.. తొందరపడకండి. ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ ఉంది? ఈఎంఐ ఎంత పడుతుంది? ప్రాసెస్‌ ఫీజులు ఏమైనా ఉన్నాయా? అని పూర్తిగా తెలుసుకొని అప్పుడు తీసుకోండి. అయితే ప్రస్తుతానికి కొన్ని ప్రముఖ బ్యాంక్‌లు పర్సనల్‌ లోన్స్‌పై ఎంత వడ్డీ ఛార్జ్‌ చేస్తున్నాయో తెలుసుకుందాం..

ప్రభుత్వ బ్యాంకులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): ఈ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ ఏడాది 10.05 నుండి 15.05 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. ఈ రేట్లు 15 ఆగస్టు 2025 నుండి అమల్లోకి వచ్చాయి. పర్సనల్ లోన్ పై ప్రాసెసింగ్ ఛార్జీలు రూ.1,000 నుంచి రూ.15,000 వరకు ఉంటాయి. మనం తీసుకునే లోన్‌ మొత్తంపై అది ఆధారపడి ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ ప్రభుత్వ బ్యాంకు సంవత్సరానికి 10.40 శాతం నుండి 15.75 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇది పర్సనల్‌ లోన్లపై సంవత్సరానికి 10.75 శాతం నుండి 14.45 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది.

ప్రైవేట్‌ ‍బ్యాంకులు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు సంవత్సరానికి 9.99 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. అలాగే రూ.6,500 ప్రాసెసింగ్ ఛార్జీలతో పాటు దానిపై జీఎస్టీని వసూలు చేస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్: అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ సంవత్సరానికి 10.60 శాతం నుంచి 16.50 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఛార్జీలు రుణ మొత్తంలో 2 శాతం వరకు ఉంటుంది. ఇతర వర్తించే పన్నులు ఉంటాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్: వడ్డీ రేటు ఛార్జీలు సంవత్సరానికి 9.98 శాతం నుండి ప్రారంభమవుతాయి. ప్రాసెసింగ్ ఫీజు 5 శాతం వరకు ఉంటుంది. ఇతర పన్నులు అదనం.

ఫెడరల్ బ్యాంక్: ఇది సంవత్సరానికి 11.99 నుండి 18.99 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు సంవత్సరానికి 3 శాతం వరకు ఉంటాయి.

మరిన్ని పర్సనల్‌ ఫైనాన్స్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి