
Aadhar Card: ఆధార్ లేకుండా ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలు పొందలేము. దేనికైనా సరే ఆధార్ అనేది ఒక నిత్యవసర డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎప్, ఇన్స్యూరెన్స్ పాలసీలు లాంటి వాటితో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం UIDAI తన వెబ్‌సైట్, యాప్స్ ద్వారా సులువుగా ఆధార్ సర్వీసులు పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు అడ్రెస్ అప్డేట్, ఆధార్ నెంబర్లు వెరిఫై చేసుకోవడం లాంటి సేవలు పొందవచ్చు. మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఈ మెయిల్ ఐడీని మీరు ఆన్‌లైన్ చెక్ చేసుకోవచ్చు.
-ఈకేవైసీ కోసం ఓటీపీలు అందుకోవడానికి అసవరం
-డిజీలాకర్, పాన్-ఆధార్ లింక్, సబ్సిడీల కోసం
-బ్యాంకింగ్, ఇతర డిజిటల్ విధానంలో ఆధార్ వెరిఫికేషన్‌కు అవసరం
-ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవడం కోసం అసవరం
-UIDAI వెబ్‌సైట్లోకి వెళ్లండి
-వెరిఫై ఆధార్ లింక్డ్ మొబైల్/ఈమెయిల్ ఆప్షన్‌ను ఎంచుకోండి
-మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
-మీరు వెరిఫై చేయాల్సిన మొబైల్ నెంబర్ టైప్ చేయండి
-క్యాప్చా కోడ్ నమోదు చేయండి
-ప్రాసెస్డ్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కనపడుతుంది
-https://tafcop.dgtelecom.gov.in.వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
-మీ మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేయండి
-మీ ఆధార్‌తో అసోసియేట్ అయి ఉన్న మొబైల్ నెంబర్ లిస్ట్ కనపడుతుంది