Gold Leasing: మీ ఇంట్లోని బంగారాన్ని అద్దెకిచ్చి డబ్బులు సంపాదించండి.. ఎలానో తెలుసా..?

కార్లు, బైక్‌లు, ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు రెంట్‌కి ఇచ్చిన డబ్బలు సంపాదించే వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. కానీ మీ ఇంట్లోని బంగారాన్ని కూడా మీరు రెంట్‌కి ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చు, ఇండియాలో దీనికి అధికారికంగా అనుమతులు కూడా ఉన్నాయి. అదెలానో తెలుసా..

Gold Leasing: మీ ఇంట్లోని బంగారాన్ని అద్దెకిచ్చి డబ్బులు సంపాదించండి.. ఎలానో తెలుసా..?
Gold Rent

Updated on: Nov 26, 2025 | 9:48 PM

Gold Rent: డబ్బులు సంపాదించడానికి వంద మార్గాలు ఉంటాయంటూ పెద్దలు. కాలం మారుతున్న కొద్ది డబ్బులు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు వస్తున్నాయి. కష్టపడి డబ్బులు సంపాదించే మార్గం ఒకటుంటే.. తమ స్మార్ట్ వర్క్, తెలివితో డబ్బులు సంపాదించేవారు మరికొంతమంది. వస్తువులను అద్దెకిచ్చి ఆదాయం పొందే పద్దతులు చాలానే ఉన్నాయి. కానీ మీ దగ్గరున్న బంగారాన్ని కూడా అద్దెకిచ్చి డబ్బులు సంపాదించవొచ్చు అని మీకు తెలుసా..? బంగారాన్ని ఫంక్షన్లు, పండుగల సమయంలో ధరించి మిగతా సమాయాల్లో బీరువాలో భద్రంగా దాస్తుంటాం. కానీ అవసరం లేని సమయాల్లో బంగారాన్ని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందే మర్గాలు చాలానే అందుబాటులో ఉన్నాయి.

లీజుకు బంగారం

మీ బంగారాన్ని మీరు కొద్ది కాలానికి లీజుకు ఇచ్చి డబ్బులు సంపాదింవచ్చు. షాపుల యజమానులు, పెట్టుబడిదారులు , గోల్డ్ రిఫైనింగ్ సంస్థలకు మీరు ఇవ్వొచ్చు. ఒకవేళ మీరు బంగారం షాపుల యజమానులకు 6 నెలల కాలానికి లీజుకు ఇస్తే.. ఆ వ్యాపారి మీ బంగారాన్ని ఉపయోగించి కొత్త ఆభరణాలను తయారుచేసి విక్రయిస్తాడు. 6 నెలలు పూర్తైన తర్వాత మీకు అదే మొత్తంలో బంగారంతో పాటు  వడ్డీ చెల్లిస్తాడు. వడ్డీతో పాటు బంగారం ధరలు పెరిగినప్పుడు మీకు మరింత లాభం జరుగుతుంది. ఇక పెట్టుబడిదారులు ,సంస్థలకు లీజుకు ఇస్తే మీకు చివరిలో వడ్డీ చెల్లిస్తారు. మీరు ఇలా లీజుకు ఇచ్చి సంవత్సరానికి 1 శాతం నుంచి 7 శాతం వరకు ఆదాయం పొందే అవకాశముంది.

యాప్స్‌లలో లీజింగ్

ఇక కొన్ని యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా మీరు డిజిటల్ గోల్డ్‌ను లీజుకు ఇవ్వొచ్చు. సేఫ్ గోల్డ్ లాంటి యాప్స్ అనేకం అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా డిజిటల్ గోల్డ్‌ని జ్యూవెల్లర్స్‌కి లీజు లేదా అద్దెకు ఇవ్వొచ్చు. ఎంత కాలానికి లీజుకు ఇవ్వాలనుకుంటున్నారనేది మీరు నిర్ణయించుకోవచ్చు. డిజిటల్ గోల్డ్‌ని లీజుకు ఇవ్వడం ద్వారా వార్షిక కాలంలో 3 నుంచి 6 శాతం రిటర్న్స్ సంపాదించుకోవచ్చు. 10 గ్రాముల బంగారం కలిగి ఉన్నవారు కూడా లీజుకు ఇవ్వొచ్చు. ఇండియాలో వీటికి అధికారిక అనుమతులు కూడా ఉన్నాయి. అందుకే ఈ వ్యాపారం చట్టరీత్యా అనుమతి పొందింది.  ఇటీవల ఈ వ్యాపారం కూడా బాగా సాగుతోంది.