
ఏటీఎం కార్డులపై ఇటీవల బ్యాంకులు ఆన్‌లైన్ షాపింగ్‌పై డిస్కౌంట్లతో పాటు బుక్ మై షో వెబ్‌సైట్‌లో ఫ్రీ టికెట్లు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లపై క్యాష్ బ్యాక్స్ వంటి బెనిఫిట్స్ అందిస్తున్నాయి. అయితే డెబిట్ కార్డు తీసుకున్నవారికి ఉచిత బీమా సౌకర్యాన్ని కూడా బ్యాంకులు కల్పిస్తున్నాయి. అంటే మీరు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బీమా సదుపాయం పొందవచ్చు. ఈ మేరకు కస్టమర్లకు డెబిట్ కార్డుపై ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి తెచ్చాయి.
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డు తీసుకున్న కస్టమర్లకు ఉచిత ప్రమాద బీమా అందిస్తోంది. కార్డును బట్టి రూ.2 నుంచి రూ.20 లక్షల వరకు పరిమితి ఉంటుంది. బయట ప్రమాద బీమా తీసుకోవాలంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎస్‌బీఐ ఎలాంటి ప్రీమియం తీసుకోకుండానే డెబిట్ కార్డు వినియోగదారులకు ఉచిత ప్రమాద బీమా అందిస్తోంది. ప్రమాదంలో చనిపోతే కుటుంబసభ్యులకు ఈ సొమ్ము అందుతోంది.
రోడ్డు, ఇతర ప్రమాదాల్లో మరణిస్తే ఎస్‌బీఐ గోల్డ్ మాస్టర్ లేదా వీసా కార్డు, ప్రైడ్ బిజినెస్ డెబిట్ కార్డులు ఉన్నవారికి రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పి్స్తోంది. ఇక ఎస్‌బీఐ ప్లాటినమ్, ఎస్‌బీఐ ప్రీమియం బిజినెస్ బెడిట్ కార్డులు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా ఉంటుంది. ఇక ఎస్‌బీఐ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డు ఉన్నవారికి రూ.10 లక్షల బీమా సదుపాయం ఉంది. ఇక విమాన ప్రమాదాలకు సంబంధించి ఎస్‌బీై గోల్డ్, ప్రైడ్ బిజినెస్ కార్డ్ ఉన్నవారికి రూ.4 లక్షలు, ఎస్‌బీఐ ప్లాటినమ్, ఎస్‌బీఐ ప్రీమియం బిజినెస్ ఉన్నవారికి రూ.10 లక్షలు అందిస్తోంది. ఇక ఎస్‌బీఐ వీసా సిగ్నేచర్ కార్డు ఉన్నవారికి రూ.20 లక్షల బీమా వర్తిస్తుంది.
-ప్రమాదం జరిగిన 90 రోజుల ముందే ఏటీఎం కార్డును ఉపయోగించి ఉండాలి
-కార్డు వాడకపోతే బీమా సౌకర్యం వర్తించదు
-స్వైపింగ్ మెషిన్, ఆన్ లైన్ వెబ్ సైట్లలో కార్డు ఉపయోగించి ట్రాన్సాక్షన్లు చేసినా వర్తిస్తుంది
-బ్యాంక్ మిత్రలు, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా లావాదేవీలు చేసినా చెల్లుబాటు అవుతుంది
ప్రమాదంలో ప్రమాదవశాత్తూ మరణించిన తర్వాత కుటుంబసభ్యులు బ్యాంక్‌ను సంప్రదించాలి. అనంతరం క్లెయిమ్ కోసం దరఖాస్తు ఫారం పెట్టుకోవాలి. ప్రమాదంకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని అందించాలి. కేవలం ప్రమాదంలో మరణిస్తేనే బీమా సొమ్ము అందుతుంది. సహజ, అనారోగ్య కారణాలతో మరణిస్తే బీమా అందదు.