
Personal Finance Tips: నేటి ఆధునిక జీవనశైలిలో ముఖ్యంగా ఐటీ ఉద్యోగులలో మంచి జీతం రాగానే తమ స్థాయికి మించి అప్పులు చేసే ధోరణి పెరుగుతోంది. దీనివల్ల అధిక EMIల భారం, పొదుపు లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రముఖ ఆర్థిక విద్యావేత్తలు అప్పుల భారం నుంచి తప్పించుకోవడం ఎలాగో చిట్కాలు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
ఆర్థిక నిపుణులు ఒక ఉదాహరణతో వివరిస్తున్నారు. ఒక వ్యక్తికి లక్ష రూపాయల టేక్ హోమ్ జీతం ఉంది. ఆయన రూ.50 లక్షల హోమ్ లోన్ (25 ఏళ్లకు 7.9% వడ్డీతో), రూ.10 లక్షల కార్ లోన్ (6 ఏళ్లకు రూ.18,500 EMI), రూ.5 లక్షల పర్సనల్ లోన్ (కొత్త ఫర్నిచర్ కోసం రూ.10,900 EMI) కలిగి ఉన్నారు. ఈ అన్ని EMIలు కలిపి నెలకు రూ.67,500 అవుతున్నాయి. అంటే ఆయన జీతంలో 68% కేవలం రుణ సేవకే వెళ్తుంది. మిగిలిన రూ.30,000తో జీవన వ్యయాలు గడపాలి. పొదుపునకు అసలు ఆస్కారం లేదు. ఇది చాలా మంది ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి.
ఇది కూడా చదవండి: Paddy Cultivation: ఒక ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..? పూర్తి లెక్కలివే..!
ఆదాయం పెరగగానే కొందరు అవసరం లేకపోయినా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అప్‌గ్రేడ్‌లు, లగ్జరీల వెంట పడతారు. ఇల్లు కొనేటప్పుడు తమ బడ్జెట్‌ను మించి ఖర్చు చేస్తారు. కొవిడ్ అనంతర కాలంలో తక్కువ వడ్డీ రేట్లకు లభించిన హోమ్ లోన్‌లు, ఆ తర్వాత RBI వడ్డీ రేట్లను పెంచడంతో EMIలు పెరిగి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చాలా మందికి ప్రాపర్టీ విలువ పెరగకుండా, వడ్డీకే అధిక భాగం చెల్లిస్తున్నారనే చేదు నిజాన్ని తెలుసుకుంటున్నారు. ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) లేకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం వంటివి ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి.
ఇది కూడా చదవండి: Wood vs UPVC Windows: వుడ్ విండోస్ వర్సెస్ యూపీవీసీ విండోస్.. తక్కువ ఖర్చులో మీ ఇంటికి ఏది బెస్ట్..!
1. హోమ్ లోన్ బదిలీ: ప్రస్తుత 7.9% హోమ్ లోన్‌ను తక్కువ వడ్డీ రేటు (ఉదాహరణకు, 7.1% నుండి 7.5%) అందిస్తున్న మరో బ్యాంకుకు బదిలీ చేయండి.
2. అదనపు లోన్: హోమ్ లోన్ బదిలీ చేసేటప్పుడు, అవసరమైతే రూ.50 లక్షలకు బదులుగా రూ.65 లక్షల వరకు తీసుకోండి.
3. ఇతర రుణాలను తీర్చడం: అదనంగా వచ్చిన మొత్తంతో అధిక వడ్డీ రేటు ఉన్న కార్ లోన్, పర్సనల్ లోన్‌లను పూర్తిగా తీర్చండి.
4. EMI తగ్గింపు: ఈ విధంగా చేయడం ద్వారా రూ.68,000 ఉన్న EMI దాదాపు రూ.48,000కి తగ్గుతుంది. ఇది రూ.20,000 భారీ తగ్గింపు.
5. పొదుపు ప్రారంభం: మిగిలిన రూ.20,000ను అత్యవసర నిధి ఏర్పాటుకు, ఆరోగ్య బీమాకు, పిల్లల భవిష్యత్తుకు లేదా వ్యక్తిగత పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.
6. వార్షిక హైక్ వినియోగం: ప్రతి సంవత్సరం జీతం పెరిగినప్పుడు ఆ పెరిగిన మొత్తంలో కొంత భాగాన్ని అప్పులు తీర్చడానికి (అదనపు ప్రిన్సిపల్ చెల్లింపు) లేదా పెట్టుబడులు పెంచడానికి ఉపయోగించండి. దీనివల్ల హోమ్ లోన్ 10-15 సంవత్సరాలలోపు తీరిపోయే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
ఇది కూడా చదవండి: మొక్క జొన్న ఉడకబెట్టి తినడం మంచిదా? కాల్చి తినడం మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి