Ayodhya: అయోధ్య వెళ్లే వారికి పేటీఎం బంపరాఫర్‌.. క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం

అయోధ్యను సందర్శించడానికి వెళ్లే భక్తుల కోసం విమాన, బస్సు టిక్కెట్లపై ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తున్నారు. రామయ్యను దర్శించుకునేందుకు వెళ్తున్న వారికి వారి బస్సు, విమాన ఛార్జీలపై 100 శాతం క్యాష్‌బాక్‌ పొందేలా అవకాశం కల్పించారు. ఇందుకోసం పేటీఎమ్‌ నుంచి టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో బస్సు అయితే..

Ayodhya: అయోధ్య వెళ్లే వారికి పేటీఎం బంపరాఫర్‌.. క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం
Ayodhya Paytm

Updated on: Jan 30, 2024 | 4:29 PM

వందల ఏళ్లనాటి రామమందిర కల సాకారమైన తరుణంలో యావత్‌ దేశం పులకరించి పోయింది. ఎంతో మంది అతిరథ మహారథలు నడుమ, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా లైవ్‌లో వీక్షించారు. ఇక ఎన్నో ఏళ్ల నాటి రామ మందిర కల సాకారమైన వేళ లక్షలాదిగా ప్రజలు అయోధ్యకు తరలి వెళుతున్నారు. దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. దీంతో అయోధ్యలో ఇసుకవేస్తే రాలనంత జనాలు ఉన్నారు. దీంతో అయోధ్య పట్టణంలో అధునాతన సదుపాయాలతో కూడిన హోటల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం ప్రముఖ యూపీఐ పేమెంట్‌ సంస్థ పేటీఎమ్‌ మంచి ఆఫర్‌ను ప్రకటించింది.

అయోధ్యను సందర్శించడానికి వెళ్లే భక్తుల కోసం విమాన, బస్సు టిక్కెట్లపై ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తున్నారు. రామయ్యను దర్శించుకునేందుకు వెళ్తున్న వారికి వారి బస్సు, విమాన ఛార్జీలపై 100 శాతం క్యాష్‌బాక్‌ పొందేలా అవకాశం కల్పించారు. ఇందుకోసం పేటీఎమ్‌ నుంచి టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో బస్సు అయితే.. ‘BUSAYODHYA’, విమానం అయితే.. *FLYAYODHYA’ అనే ప్రోమో కోడ్‌ను ఉపయోగించాలని పేటీఎమ్‌ నిర్వాహకులు తెలిపారు. బస్సు ప్రయాణికులు రూ. 1000 వరకు క్యాష్‌బాక్‌ను పొందొచ్చు. అలాగే విమాన ప్రయాణికులు రూ. 5000 వరకు క్యాష్‌బాక్‌ను పొందొచ్చని పేటీఎమ్‌ నిర్వాహకులు ప్రకటించారు.

అంతేకాకుండా ప్రయాణికుల కోసం ఉచితం క్యాన్సలేషన్‌ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏవైనా కారణాల వల్ల టికెట్‌ను క్యాన్సెల్ చేసుకుంటే.. రూపాయి కూడా కట్ కాకుండా 100 శాతం రిఫండ్‌ను పొందొచ్చు. ఇందుకోసం ప్రయాణికులు ఎలాంటి కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే పేటీఎమ్‌ ద్వారా బస్సులో టికెట్ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు లైవ్‌ ట్రాకింగ్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బస్సులో ప్రయాణిస్తున్న వారు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తాము ప్రయాణిస్తున్న బస్సు రియల్‌ టైమ్‌ బస్‌ లొకేషన్‌ను షేర్‌ చేయొచ్చు.

ఇదే విషయమై పేటీఎమ్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘మొబైల్ చెల్లింపులు, క్యూఆర్‌ టెక్నాలజీ మేము ముందు వరుసలో ఉన్న కారణంగా ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ను అందిస్తున్నాము. అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ను పరిచయం చేయడం ఆనందంగా ఉంది. బస్సు, ఫ్లైట్‌ బుకింగ్‌లపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు మరెన్నో అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..