Online Food Order: జొమాటో కంటే ముందే.. గ్రాసరీ సంస్థ కీలక నిర్ణయం.. 10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ

|

Apr 18, 2022 | 9:42 PM

Online Food Order: కేవలం పది నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇటీవల ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించగా, దానికన్న ముందే..

Online Food Order: జొమాటో కంటే ముందే..  గ్రాసరీ సంస్థ కీలక నిర్ణయం.. 10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ
Follow us on

Online Food Order: కేవలం పది నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇటీవల ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ప్రకటించగా, దానికన్న ముందే ఆన్‌లైన్‌ గ్రాసరీ డెలివరీ సంస్థ జెప్టో (Zepto) కేఫ్‌ అనే యాప్‌ ద్వారా ఫుడ్‌డెలివరీ సేవలను ప్రారంభించింది. పైలట్‌ ప్రాజెక్టు కింద ముందుగా ముంబై (Mumbai) మహానగరంలో 10 నిమిషాల ఫుడ్‌ డెలివరీ సేవలను జెప్టో ప్రారంభించింది. అయితే జెప్టో ప్రస్తుతం రూ. 99 కంటే ఎక్కువ ఫుడ్‌ ఆర్డర్స్‌పై ఉచితంగా డెలివరీ చేస్తోంది. కేవలం పది నిమిషాల్లోనే కస్టమర్లకు ఫుడ్‌ను అందించేందుకు జెప్టో ముంబైకి చెందిన స్టార్టప్ బ్లూ టోకాయ్ కాఫీ, చాయోస్, గురుకృపా స్నాక్స్, సాసీ టీస్పూన్ వంటి రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం పది నిమిషాల్లో తయారయ్యే టీ, సమోసాలు, కాఫీ, శాం డ్‌విచ్స్‌ వంటి ఆహర పదార్థాలను డెలివరీ అందిస్తోంది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జెప్టో వ్యవస్థాపకుడు ఆదిత్‌ పాలిచా తెలిపారు.

అయితే గత కొద్ది రోజుల కిందట పది నిమిషాల్లోనే కస్టమర్లకు ఫుడ్‌ డెలివరీ చేస్తామని జొమాటో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జొమాటో ప్రకటనతో చాలా దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. పది నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ చేయడం సాధ్యమేనా..? అని ప్రశ్నించారు. ఇక జొమాటోకు షాకిస్తూ జెప్టో డెలివరీ సేవలను ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి:

Ola Uber Fare: ఓలా, ఉబెర్‌ టాక్సీ ఛార్జీలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు..?

Covid 19: ఆ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ నాలుగు జిల్లాల్లో ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరి..!