
Success Story: కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే చేసే పని ఏదైనా విజయం వరిస్తుందని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రవి సాహు నిరూపిస్తున్నారు. కేవలం రూ. 20,000 అప్పుతో ప్రారంభమైన ఆయన వ్యాపారం, నేడు వేలాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. రూ. 150 జీతం నుండి యజమాని వరకు తన జీవితం కొనసాగుతోంది. ఒకప్పుడు రవి సాహు ఒక హోటల్‌లో రోజుకు కేవలం రూ. 150 కూలీకి పనిచేసేవారు. 12వ తరగతి వరకు చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో ఆ తక్కువ జీతంతోనే కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. ఆ సమయంలోనే ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎదుటివారి దగ్గర పని చేయడం మానేసి, సొంతంగా ఏదైనా ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు.
ఇది కూడా చదవండి: Gas Cylinder Tips: ఈ టిప్స్ ఫాలో అయితే నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు వస్తుంది!
ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా కచేరీ చౌక్ వద్ద రవి ఒక చిన్న బండిపై ఇడ్లీ, దోశ అమ్మడం ప్రారంభించారు. ప్రస్తుతం బయట దోశ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, రవి మాత్రం కేవలం రూ. 30 లకే వేడివేడి సాంబార్, కొబ్బరి చట్నీతో రుచికరమైన మసాలా దోశను అందిస్తున్నారు. ఈ తక్కువ ధర, నాణ్యమైన రుచే ఆయనను వెతుక్కుంటూ కస్టమర్లు వచ్చేలా చేస్తోంది.
గత 11 ఏళ్లుగా నిరంతరాయంగా శ్రమిస్తున్న రవి, నేడు తన బండిపై రోజుకు 50-60 ప్లేట్ల ఇడ్లీ, 60-70 ప్లేట్ల దోశ విక్రయిస్తున్నారు. దీని ద్వారా ఆయన రోజుకు రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు వస్తోంది. కేవలం బండి దగ్గరే కాకుండా, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు కేటరింగ్ ఆర్డర్లు కూడా తీసుకుంటూ తన ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నారు.
“నేను మొదలుపెట్టినప్పుడు చాలా కష్టాలు పడ్డాను, ఒక్కోసారి గిరాకీ కూడా ఉండేది కాదు. కానీ వెనకడుగు వేయలేదు,” అని రవి గర్వంగా చెబుతారు. ఉద్యోగం దొరకలేదని కుంగిపోకుండా, తనకున్న వంట నైపుణ్యాన్ని వ్యాపారంగా మలుచుకుని నేడు ఒక విజయవంతమైన చిరు వ్యాపారిగా నిలబడ్డారు. అయితే రవి అందరికి ఆదర్శమనే చెప్పాలి. పని ఏదైనా అది చిన్నది కాదు, మన ఆలోచన, కష్టం గొప్పదైతే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు.
ఇవి కూడా చదవండి:
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి