Ola Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాలు గత కొంత కాలంగా కారణం తెలియకుండానే పేలిపోతున్నాయి(Fire). కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుంది. వరుసగా జరుగుతున్న ఈవీలు కాలిపోవటం వెనుక కారణాలు కనుక్కోమని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో పలు కంపెనీలు తమ వాహనాలను రీకాల్ చేస్తున్నాయి. తాజాగా.. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకున్న ఘటనల నేపథ్యంలో 1,441 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్(Recall) చేస్తున్నట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది. మార్చి 26న పూణెలో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని కంపెనీ తెలిపింది.
ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతైన సంఘటనలు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. ఈ కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాదాలను అరికట్టేందుకు తయారీదారులు తమ వాహనాలను రీకాల్ చేయవలసి వస్తోంది. ఒకినావా ఆటోటెక్ 3,000 యూనిట్లకు పైగా రీకాల్ చేసింది. Pure EV దాదాపు 2,000 యూనిట్ల కోసం ఇదే విధమైన కసరత్తు చేసింది. నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే కంపెనీలపై భారీగా జరిమానాలు ఉంటాయని కేంద్రం ఈ మధ్య హెచ్చరించింది. నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Zomato: ఫుడ్ ప్యాకింగ్ విషయంలో జొమాటో సంచన నిర్ణయం.. ఈ నెల నుంచి వాటిపై పూర్తి నిషేధం..
House Buying: ఇంటి కోసం మీరు డబ్బు కట్టిన కంపెనీ దివాలా తీస్తే ఏమి చేయాలి.. పూర్తి వివరాలు..