అక్షయ తృతీయ ఆఫర్లు.. ఎలక్ట్రిక్‌ స్కూటీ కొనాలనుకునేవారికి పండగే! రూ.50 వేల తగ్గింపు

అక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ 'ఓలా సోనా వీకెండ్' సేల్ ప్రకటించింది. EVలపై రూ.50,000 వరకు డిస్కౌంట్లు, 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ, లక్కీ డ్రా బహుమతులు అందిస్తోంది. Ola S1 X, Roadster X మోడళ్లు కేవలం రూ.49,999 నుండి అందుబాటులో ఉన్నాయి.

అక్షయ తృతీయ ఆఫర్లు.. ఎలక్ట్రిక్‌ స్కూటీ కొనాలనుకునేవారికి పండగే! రూ.50 వేల తగ్గింపు
Ola Sona Weekend

Updated on: Apr 18, 2026 | 9:18 PM

అక్షయ తృతీయ సందర్భంగా ప్రముఖ ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. ‘ఓలా సోనా వీకెండ్‌’ పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించి, కస్టమర్లకు గరిష్టంగా రూ.50,000 వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్లు కేవలం శనివారం, ఆదివారం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రూ.40,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, స్కాపియా ఫెడరల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, HSBC క్రెడిట్ కార్డులతో చెల్లింపు చేస్తే మరో రూ.10,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.

ఆఫర్లలో భాగంగా కొన్ని వాహనాల ధరలను గణనీయంగా తగ్గించారు. ఓలా S1 X (2kWh), Ola రోడ్‌స్టర్‌ X (2.5kWh) ప్రారంభ ధరను కేవలం రూ.49,999గా నిర్ణయించారు. ఇది ఈ సెగ్మెంట్‌లోనే చాలా ఆకర్షణీయమైన ధరగా చెప్పుకోవచ్చు. మరోవైపు Ola రోడ్‌స్టర్‌ X+ 9.1పై ఏకంగా రూ.50,000 డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో ఈ హై-ఎండ్ మోడల్‌ను రూ.1,39,999కే కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. అదనంగా ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన వాహనాలకు 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఇవ్వడం కంపెనీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇంకా ఈ రెండు రోజుల్లో వాహనం కొనుగోలు చేసిన వినియోగదారుల్లో ఒకరికి లక్కీ డ్రా ద్వారా ‘ఓలా సోనా స్పెషల్‌ ఎడిషన్‌’ వాహనం బహుమతిగా అందించనున్నారు. అలాగే 4680 భారత్ సెల్‌తో రూపొందించిన రోడ్‌స్టర్‌ X+ 9.1 మోడల్ కొనుగోలు గడువును కూడా కంపెనీ పొడిగించింది. మొత్తంగా చూస్తే అక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తీసుకొచ్చిన ఈ ఆఫర్లు ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారికి మంచి అవకాశంగా మారాయి. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయమని చెప్పవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us