Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు.. నష్టాల్లో చమురు కంపెనీలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉండగా మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరుగుతోంది. అయితే దేశీయ చమురు కంపెనీలు ఈ రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు...

Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు.. నష్టాల్లో చమురు కంపెనీలు..

Updated on: Jun 19, 2022 | 6:45 AM

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉండగా మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరుగుతోంది. అయితే దేశీయ చమురు కంపెనీలు ఈ రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ఆయా కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఫలితంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ షేర్లు ప్రస్తుతం 52 వారాల కనిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. ఇండియన్ ఆయిల్ షేర్ కూడా కనిష్ట స్థాయికి కొద్ది దూరంలోనే ఉంది. ఈ కంపెనీలు రోజూ కోట్లలో నష్టపోతున్నాయి. నష్టాన్ని తగ్గించుకునేందుకు ఉద్దేశపూర్వకంగా పెట్రోల్ పంపులో విక్రయాలు తగ్గించడం వల్ల ఇంధన సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధర బ్యారెల్ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 115 డాలర్లకు చేరువలో ఉంది. దీని వల్ల లీటర్ పెట్రోల్‌పై రూ.10-12, డీజిల్‌పై రూ.23-25 ​​నష్టం వాటిల్లుతోంది.

చివరిసారిగా మే 21న పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మే 22న దేశవ్యాప్తంగా చమురు ధరల్లో చివరి మార్పు జరిగింది. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.111.35 కాగా, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు. అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.97.82 ఉంది. ఏపీలోని విజయవాడలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.111.66 ఉండగా.. డీజిల్‌ లీటర్‌కు రూ.99.43గా ఉంది.