India Crorepati Club: భారత్‌లో భారీగా పెరిగిన కోటీశ్వరుల సంఖ్య.. గత 6 సంవత్సరాలలో మూడు రెట్లు..

|

Aug 20, 2023 | 9:21 PM

Crorepati Taxpayers in India: భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగింది. సీబీడీటీ డేటా ప్రకారం, గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం బ్రాకెట్‌లో గణనీయంగా పెరిగింది. 3 సంవత్సరాలలో అటువంటి కొత్త కోటీశ్వరుల పన్ను చెల్లింపుదారులు 57,591 మంది 1 కోటి కంటే ఎక్కువ సంపాదించే బ్రాకెట్‌లో చేరారు. కోవిడ్‌కు ముందు.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో.. అటువంటి పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1,11,939 ఉంటే..

India Crorepati Club: భారత్‌లో భారీగా పెరిగిన కోటీశ్వరుల సంఖ్య.. గత 6 సంవత్సరాలలో మూడు రెట్లు..
Crorepati
Follow us on

భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఆరు సంవత్సరాల్లో వారి సంఖ్య భారీగా పెరిగింది. ఏడాదికి కోటి సంపాధిస్తున్నవారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వారి సంఖ్య భారీగా పెరిగిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో దేశంలో ధనవంతుల సంఖ్య వేగంగా పెరిగింది. ధనవంతుల లెక్కలు అప్పుడప్పుడూ ఇలాగే రిపీట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇన్కమ్ టాక్స్ విభాగం అందించిన లెక్కల ప్రకారం వీరి సంఖ్య బయటకొచ్చింది. గత మూడేళ్లలో కొత్తగా క్రోర్‌పతి క్లాబ్‌లో చేరినవారి సంఖ్య 50 శాతానికి పైగా పెరిగింది.

సీబీడీటీ డేటా ప్రకారం, గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం బ్రాకెట్‌లో గణనీయంగా పెరిగింది. 3 సంవత్సరాలలో అటువంటి కొత్త కోటీశ్వరుల పన్ను చెల్లింపుదారులు 57,591 మంది 1 కోటి కంటే ఎక్కువ సంపాదించే బ్రాకెట్‌లో చేరారు. కోవిడ్‌కు ముందు.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో.. అటువంటి పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1,11,939 ఉంటే.. వారి సంఖ్య 2022-23లో 1,69,890కి పెరిగింది. మూడేళ్లలో ఇది 51 శాతం పెరుగుదల కనిపించింది. 2016-17లో ఇలా పన్ను చెల్లింపుదారుల సంఖ్య 68,263 మాత్రమే.

అలాంటి వారి సంఖ్య ఒక్కసారి మాత్రమే తగ్గింది

కొవిడ్ కాలంలో ఈ లెక్కలు మరింతగా పెరిగాయి. అంటువ్యాధి కారణంగా దేశం నెలల తరబడి లాక్ డౌన్ చేయవలసి వచ్చింది. దీని కారణంగా లక్షలాది కర్మాగారాల్లో పనులు ఆగిపోయాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారు. గత మూడేళ్లలో, 2020-21లో కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఒక్కసారి మాత్రమే తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆ సంవత్సరం అటువంటి పన్ను చెల్లింపుదారులు 81,653కి తగ్గించబడ్డారు.

ఈ కారణాల వల్ల మిలియనీర్లు..

మిలియనీర్ల సంఖ్య పెరగడానికి చాలా కారణాలున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా టాక్స్ చెల్లింపు ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో కూడా ఓ కారణం అని తేలింది. ఇవేకాకుండా స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు, కొత్తగా కంపెనీలు పుట్టుకురావడం, పెరిగిన జీతాలతో ఉద్యోగుల్లో బూమ్ కనిపించడం.. ఒకరు రెండు ఉద్యోగాలు చేయడం కూడా కోటీశ్వరలు సంఖ్య పెరగడానికి కారణంగా మారింది.

ఐటీఆర్ ఫైలింగ్‌లో రికార్డు వేగవంతమైన పెరుగుదల

ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలుకు గడువు ముగిసింది. టాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలైతో ముగిసింది. దీంతో కొందరు రిటర్న్ ఫైల్ చేయనివారు రూ. 1000 ఫైన్ చెల్లంచి కూడా ఫైలింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. గడువు తేదీ వరకు, 6.75 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారు, ఇది గత సీజన్‌తో పోలిస్తే కోటి కంటే ఎక్కువ.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి