NPCI New Rules: ఫిర్యాదులకు ఆన్ లైన్ వ్యవస్థ.. త్వరలోనే UPI ద్వారా ఇంటర్నేష్నల్ పేమెంట్స్..

|

Apr 17, 2022 | 6:33 PM

NPCI New Rules: UPI ద్వారా చేసే డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి, కస్టమర్ల సౌకర్యం కోసం NPCI కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వీటి వల్ల వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల్లో సమస్యలకు పరిష్కారం దొరకనుంది.

NPCI New Rules: ఫిర్యాదులకు ఆన్ లైన్ వ్యవస్థ.. త్వరలోనే UPI ద్వారా ఇంటర్నేష్నల్ పేమెంట్స్..
Upi
Follow us on

NPCI New Rules: UPI ద్వారా చేసే డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి, కస్టమర్ల సౌకర్యం కోసం NPCI కొత్త రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు, థర్డ్-పార్టీ అప్లికేషన్‌ దారులను వివాదాల పరిష్కారానికి ఆన్‌లైన్ రిజల్యూషన్ వ్యవస్థను(ODR) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. UPI వ్యవస్థలో పాల్గొనే సంస్థలన్నీ సెప్టెంబర్ 30, 2022 నాటికి ఫైయిల్డ్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన వివాదాలు, ఫిర్యాదుల కోసం ODR వ్యవస్థను అమలు చేయాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఏప్రిల్ 11న జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. UPI చెల్లింపులు పెరుగుతున్న దృష్ట్యా సెప్టెంబర్ 30, 2022 నాటికి UPI ఇంటర్‌ఫేస్‌లో ఇంటర్నేషనల్ మర్చంట్ పేమెంట్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేయాలని సూచించింది. ఈ కొత్త నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకోనున్నట్లు సర్క్యులర్‌లో NPCI తెలిపింది. దీని కారణంగా ఇప్పటి వరకూ పేమెంట్స్ సమయంలో డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయి చెల్లింపు పూర్తి కాకపోవటం వంటి సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తాజాగా రానున్న కొత్త సౌకర్యం కారణంగా ఫిర్యాదులు చేసేందుకు ఒక వేదిక అందుబాటులోకి రానుంది.

NPCI అంటే ఏమిటి?

2008లో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దేశంలో రిటైల్ చెల్లింపులు, సెటిల్‌మెంట్ సిస్టమ్‌లను నిర్వహించడానికి ఒక  కార్పొరేషన్‌గా ఏర్పాటైంది. NPCI దేశంలో ఒక బలమైన చెల్లింపు, సెటిల్మెంట్ మౌలిక సదుపాయాలను నిర్మించింది. NPCI రూపే కార్డులు, తక్షణ చెల్లింపు సేవ (IMPS), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM), BHIM ఆధార్, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC FasTag) సహా వివిధ చెల్లింపు సంస్కరణలను తీసుకొచ్చింది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Gas Prices: కేంద్రం ఆ పని చేయనందునే ఆకాశానికి గ్యాస్ ధరలు .. ఆందోళనలో పరిశ్రమ వర్గాలు..

GST Rates: సామాన్యులపై రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం మోపనున్నాయా.. జీఎస్టీ రేట్ల పెంపు తప్పదా..?