UPI ATM Machine: ఇప్పుడు ఏటీఎం కార్డు లేకుండా నగదు తీసుకోవచ్చు.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

|

Sep 08, 2023 | 3:10 AM

UPI ATM Machine: UPI ద్వారా చెల్లింపులు చేసే వారికి ఇది నిజంగా శుభవార్తే. ఇప్పుడు మీరు UPIని ఉపయోగించి కూడా నగదు తీసుకోవచ్చు. అవును.. ఇప్పుడు యూపీఐ ఏటీఎం మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని మొట్టమొదటి UPI ATM మెషీన్ ద్వారా కూడా నగదు తీసుకోవచ్చు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో UPI ATM విత్‌డ్రావల్ మెషిన్ మొదటిసారిగా ప్రదర్శించింది..

UPI ATM Machine: ఇప్పుడు ఏటీఎం కార్డు లేకుండా నగదు తీసుకోవచ్చు.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు..
Upi Payments Mechiine
Follow us on

UPI ATM Machine: UPI ద్వారా చెల్లింపులు చేసే వారికి ఇది నిజంగా శుభవార్తే. ఇప్పుడు మీరు UPIని ఉపయోగించి కూడా నగదు తీసుకోవచ్చు. అవును.. ఇప్పుడు యూపీఐ ఏటీఎం మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని మొట్టమొదటి UPI ATM మెషీన్ ద్వారా కూడా నగదు తీసుకోవచ్చు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో UPI ATM విత్‌డ్రావల్ మెషిన్ మొదటిసారిగా ప్రదర్శించింది..

ఒకేసారి రూ. 10,000 విత్‌డ్రా చేసుకోవచ్చు..

మొదటిసారిగా QR కోడ్ ద్వారా నగదు లావాదేవీలు ఈ యూపీఐ ఏటీఎం ద్వారా చేయడం జరిగింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా దాదాపు 700 యంత్రాలను అమర్చనున్నారు. కస్టమర్‌లు ఒక లావాదేవీలో రూ. 10,000 వరకు నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని బ్యాంకులు చెబుతున్నాయి.

UPI ATM నుండి నగదును ఎలా ఉపసంహరించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

> ముందుగా ఎంత నగదు తీసుకోవాలో నిర్ణయించుకోవాలి.

> దీని తర్వాత, మీరు ఎంచుకున్న మొత్తం ప్రకారం, మీరు మీ స్క్రీన్‌పై QR కోడ్‌ని చూస్తారు

> మీరు మీ UPI యాప్ ద్వారా ఈ QR కోడ్‌ని స్కాన్ చేయాలి.

> దీని తర్వాత మీరు మీ UPI పిన్‌ను నమోదు చేయాలి.

> ఇప్పుడు మీ లావాదేవీ విజయవంతమవుతుంది మరియు మీకు నగదు లభిస్తుంది.

కార్డ్‌ల అవసరం లేదు..

దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో UPI ATMలు ఇన్‌స్టాల్ చేయడం జరుగుతంది. దాంతో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు కార్డ్‌ల అవసరం కూడా గణనీయంగా తగ్గనుంది. యూపీఐ ద్వారా దేశం ఏ విధంగా నగదు రహితంగా మారుతుందో, అదే విధంగా ఈ ఏటీఎంలను ఏర్పాటు చేసిన తర్వాత నగదు విత్‌డ్రా చేసుకునేందుకు కార్డు అవసరం ఉండదు.

UPI ATM ద్వారా సులభంగా మరియు సురక్షితమైన నగదు ఉపసంహరణను అందించడానికి మీరు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి . అలాగే, ప్రస్తుతం UPIని ఉపయోగించని వినియోగదారులు, లావాదేవీలు చేయడానికి వారి Android లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లలో UPI అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..