మొన్నటి వరకు కరెంట్ బిల్లు చెల్లించాలంటే కరెంట్ ఆఫీస్‌కు వెళ్లి లైన్‌లో నిలబడే పరిస్థితి ఉండేది. అయితే ఎప్పుడైతే యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపులు సింపుల్‌గా మారాయి. ఒక క్లిక్‌తో కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం లభించింది. అయితే తాజాగా ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో ఈ సేవలకు అంతరం ఏర్పడింది.
థర్డ్ పార్టీ జోక్యాన్ని తగ్గించాలే ఉద్దేశంతో ఫేన్‌పో, పేటీఎమ్ వంటి యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు కుదరవని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు యాప్స్ ద్వారా పేమెంట్ చేస్తున్న వారు ఆందోళన పడే పరిస్థితి వచ్చింది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టీజీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు సింపుల్‌గో ఫోన్‌లోనే బిల్ పేమెంట్ చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే టీఎస్‌పీడీసీఎల్ యాప్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకావం కల్పించింది.
అయితే ఇది కాస్త ఇబ్బందితో కూడుకున్న అంశం. కాబట్టి పేమెంట్స్‌ను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో కరెంటు బిల్లులపైనే క్యూఆర్ కోడ్ ముద్రించే దిశగా టీజీఎస్‌పీడీసీఎల్ అడుగులు వేస్తోంది. దీంతో మీ కరెంట్ బిల్లుపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి బిల్లును సులభంగా పే చేయొచ్చు. ఏ నెలకు ఆ నెల బిల్‌పై ఉండే క్యూఆర్ కోడ్ అప్డేడ్ అవుతుంది. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే మట్టేవాడ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్ (ఈఆర్‌ఓ) వరంగల్, భూపాలపల్లిలో అమలు చేస్తున్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ సహాయంతో ఫోన్‌లోని యూపీఐ యాప్స్‌తో స్కాన్ చేసి సులభంగా పే చేసుకోవచ్చు. దీంతో థార్డ్ పార్టీ యాప్‌లు వసూలు చేసే ఛార్జీలను కూడా తప్పించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..