Nita Ambani: నీతా అంబానీ ముఖేష్ భార్యగా మాత్రమే కాదు.. ఆమెకో పెద్ద సామ్రాజ్యం!

|

Nov 01, 2024 | 3:36 PM

Nita Ambani Birthday: హ్యాపీ బర్త్‌డే నీతా అంబానీ: ఈరోజు ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ 60వ పుట్టినరోజు. ఆమె ఓ సంపన్న వ్యక్తి భార్యనే కాకుండా ఆమె పెద్ద సామ్రాజ్యానికి యజమాని..

Nita Ambani: నీతా అంబానీ ముఖేష్ భార్యగా మాత్రమే కాదు.. ఆమెకో పెద్ద సామ్రాజ్యం!
Follow us on

నీతా అంబానీకి 60వ పుట్టినరోజు. అయినప్పటికీ ఈ వయస్సులో కూడా ఆమె చాలా చురుకుగా, ఫిట్‌గా ఉంటారు. ఆమె ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ భార్య. అయితే ఇది ఆమె ఏకైక గుర్తింపు మాత్రమే కాదు.. నిజానికి, ఆమె స్వతహాగా ఒక పెద్ద సామ్రాజ్యానికి యజమాని కూడా. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఆమె అనుమతి లేకుండా ఏ పనులు కూడా ముందుకు సాగవు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. నీతా అంబానీ వ్యక్తిగత కెరీర్‌ను పరిశీలిస్తే, ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా పని చేశారు. అప్పుడు ఆమె వేతనం కేవలం రూ.800. దీంతో 2003లో ‘ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్’ని ప్రారంభించారు. ఇక్కడ నుండి వారి స్వంత సామ్రాజ్య నిర్మాణం ప్రారంభమవుతుంది.

నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్. ఆమెకు రిలయన్స్ ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక అనుసంధానం, విపత్తు నిర్వహణ వంటి వివిధ విభాగాలు ఉన్నాయి.

క్రీడా ప్రపంచంలో పెద్ద పేరు

నీతా అంబానీని ‘ఫస్ట్ లేడీ ఆఫ్ స్పోర్ట్స్’ అని కూడా పిలుస్తారు. ఆమె IPL జట్టు ముంబై ఇండియన్స్ సహ యజమాని. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఇది ఒకటి. ఇటీవల ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా కూడా ఎంపికయ్యారు. ఈ కమిటీలో చేరిన తొలి భారతీయురాలు ఆమె. భారతదేశంలో ఫుట్‌బాల్ పునరుద్ధరణకు నీతా అంబానీ కూడా కారణమట. ఆమె ఇండియన్ సూపర్ లీగ్ వ్యవస్థాపక చైర్‌పర్సన్.

నీతా అంబానీ సామ్రాజ్యం ఇక్కడితో ఆగలేదు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ‘ఇండియా హాల్’ సహాయంతో ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని ప్రచారం చేశారు. భారతీయ హస్తకళలను నీతా అంబానీ ‘స్వదేశీ బ్రాండ్’ను ప్రోత్సహించారు. నీతా అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలో భారతీయ సంస్కృతిని కూడా ప్రచారం చేశారు. ముంబైలోని ‘నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్’ కూడా ఆమె సామ్రాజ్యంలో ఒక భాగం.

నీతా అంబానీ చాలా కాలం పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా కొనసాగారు. అయితే గత ఏడాది ఆగస్టు 2023లో ఆమె ముగ్గురు పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్‌లను రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో చేర్చుకున్నప్పుడు నీతా అంబానీ తన స్థానాన్ని వదులుకున్నారు. అయితే అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత అతిథిగా హాజరు కావడానికి నీతా అంబానీకి కంపెనీ అనుమతి ఇచ్చింది.

ఇది మాత్రమే కాదు వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనం తర్వాత ఏర్పడిన కొత్త కంపెనీ త్వరలో నీతా అంబానీ కేటగిరిలో చేర్చనున్నారు. ఆమె కొత్త కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఉంటారు. ఇది కాకుండా, ఆమె భారతీయ మహిళల కోసం ‘హర్ సర్కిల్’ పేరుతో డిజిటల్ ఉద్యమాన్ని సృష్టించారు. ఇది మహిళలు ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి సామాజిక వేదికను అందిస్తారు.