Nita Ambani: నీతా అంబానీ చీర తయారీకి 3 నెలల సమయం.. దీని వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే!

Nita Ambani Saree: నీతా అంబానీ చీరల కలెక్షన్ ఎప్పుడూ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. గతంలో ఒక అంతర్జాతీయ రెడ్ కార్పెట్ ఈవెంట్ కోసం బెంగాలీ చేనేత కార్మికులు 2 ఏళ్ల పాటు శ్రమించి నేసిన 'జామ్దానీ' చీరను ఆమె ధరించారు..

Nita Ambani: నీతా అంబానీ చీర తయారీకి 3 నెలల సమయం.. దీని వెనుక ఉన్న ప్రత్యేకత ఇదే!
Nita Ambani

Updated on: Jun 14, 2026 | 6:48 PM

Nita Ambani Saree: రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రి నీతా అంబానీ తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో భారతదేశంలోని ఫ్యాషన్ ప్రియుల దృష్టిని మరోసారి ఆకర్షించారు. ఆరు గజాల చీరకట్టులో ఆమె చూపించే హుందాతనం, గాంభీర్యం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తుంది. తాజాగా ఒక అంతర్జాతీయ వైద్యుల సదస్సులో పాల్గొన్న ఆమె, తన చీరకట్టుతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. భారతీయ చేనేత కళపై తనకున్న మక్కువను చాటుకుంటూ ‘స్వదేశ్’ బ్రాండ్‌కు చెందిన అద్భుతమైన టర్కోయిస్ (నీలం-ఆకుపచ్చ కలయిక) కలర్ బనారసి చీరను ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వారణాసికి చెందిన ప్రముఖ కళాకారులు మొహమ్మద్ యాసిన్, ఇక్బాల్ అహ్మద్‌లు దాదాపు మూడు నెలల పాటు శ్రమించి ఈ అద్భుతమైన ‘బనారసి కటాన్ సిల్క్’ చీరను తయారు చేశారట.

ఇది కూడా చదవండి: సింగిల్‌ ఛార్జ్‌తో 656 కిలోమీటర్ల రేంజ్‌.. ఈ కారుపై రూ.1.40 లక్షల వరకు తగ్గింపు!

మొఘల్ గార్డెన్ డిజైన్.. కటాన్ సిల్క్ వైభవం

నీతా అంబానీ ధరించి ఈ చీరను బనారసి పట్టు రకాలలోనే అత్యంత విలాసవంతమైన, ‘పట్టు చీరల రాణి’గా పిలిచే స్వచ్ఛమైన కటాన్ సిల్క్‌తో నేశారు. ఈ ఫ్యాబ్రిక్‌కు ఉండే ప్రత్యేకమైన మెరుపు, అందం చీరకు రాయల్ లుక్‌ను తీసకువచ్చాయి. ఇక దీనిపై మెరిసే బంగారు జరీతో చేసిన పూల డిజైన్లు, మొఘల్ గార్డెన్ సమరూపతను, నిర్మాణ శైలిని తలపిస్తున్నాయి. ఇది భారతదేశ చారిత్రక కళా వైభవానికి ప్రతిరూపంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

కడ్వా నేత ప్రత్యేకత

ఈ చీరపై ఉన్న ప్రతి డిజైన్‌ను ‘కడ్వా’ అనే సాంప్రదాయ పద్ధతిలో నేశారు. సాధారణంగా చీరలపై ఎంబ్రాయిడరీని పైనుంచి కుడతారు. కానీ ఈ కడ్వా పద్ధతిలో చీరను మగ్గంపై నేసేటప్పుడే ప్రతి పూల మొటిఫ్‌ను విడివిడిగా, ఎంతో నిశితంగా లోపల నుంచే నేసుకుంటూ వస్తారు. దీనికోసం చేనేత కార్మికులకు ఎంతో నైపుణ్యం, ఓపిక అవసరం.

3 నెలల శ్రమ..

వారణాసి చేనేత కళాకారుల దశాబ్దాల అనుభవానికి ఈ చీర ఒక నిదర్శనం. సాధారణంగా ఇలాంటి బనారసి చీరను నేసేటప్పుడు కేవలం 1 నుండి 2 ఇంచుల ఫ్యాబ్రిక్ తయారు కావడానికే దాదాపు 10 గంటల సమయం పడుతుంది. అందుకే ఒక చీర పూర్తి కావడానికి 15 రోజుల నుండి 6 నెలలు, కొన్నిసార్లు ఏడాది సమయం కూడా పడుతుంది. గ్రాఫ్ మేకింగ్, కార్డ్‌బోర్డ్/పట్టా తయారీ, సిల్క్ దారాల ప్రాసెసింగ్, డైయింగ్, బానా ప్రిపరేషన్, జరీ సెలక్షన్, వీవింగ్, ఫినిషింగ్ వంటి 9 కఠినమైన దశల ద్వారా ఈ బనారసి చీర తయారు చేశారు.

చేనేత కళకు బ్రాండ్ అంబాసిడర్ ‘నీతా అంబానీ’

నీతా అంబానీ చీరల కలెక్షన్ ఎప్పుడూ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. గతంలో ఒక అంతర్జాతీయ రెడ్ కార్పెట్ ఈవెంట్ కోసం బెంగాలీ చేనేత కార్మికులు 2 ఏళ్ల పాటు శ్రమించి నేసిన ‘జామ్దానీ’ చీరను ఆమె ధరించారు. కేవలం చీరలు కట్టుకోవడమే కాకుండా, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా భారతీయ చేనేత కార్మికులను ఆమె నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉన్నారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు కూడా ఆమె స్వయంగా వారణాసి వెళ్లి, అక్కడి మగ్గాల యజమానులను, నేత కార్మికులను కలిసి దాదాపు 50 నుండి 60 చీరలను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ బనారసి కటాన్ సిల్క్ చీర ద్వారా, ఆమె భారతీయ సాంప్రదాయ చేనేత వస్త్రాలు అంతర్జాతీయ వేదికలపై ఎంతటి గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టగలవో మరోసారి నిరూపించారు.

ఇది కూడా చదవండి: Auto News: సింగిల్‌ ఛార్జ్‌తో 656 కిలోమీటర్ల రేంజ్‌.. ఈ కారుపై రూ.1.40 లక్షల వరకు తగ్గింపు!

ఇది కూడా చదవండి: Gold, Silver Prices: ఆల్ టైమ్ హై నుంచి రూ.2 లక్షల మేర తగ్గిన వెండి.. బంగారం పరిస్థితి ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us