లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

| Edited By:

Jun 26, 2019 | 4:39 PM

మంగళవారం పరుగులు పెట్టి దేశీ స్టాక్‌మార్కెట్ బుధవారం కూడా అదే జోరు చూపించింది. బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండో రోజూ కూడా పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో 39,592 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 11,847 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మెటల్, బ్యాంకింగ్ షేర్లు జోరు చూపాయి. రూపాయి పెరుగుదల ఐటీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. నిఫ్టీ 50లో వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, సన్ […]

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
Follow us on

మంగళవారం పరుగులు పెట్టి దేశీ స్టాక్‌మార్కెట్ బుధవారం కూడా అదే జోరు చూపించింది. బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండో రోజూ కూడా పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో 39,592 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 11,847 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మెటల్, బ్యాంకింగ్ షేర్లు జోరు చూపాయి. రూపాయి పెరుగుదల ఐటీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

నిఫ్టీ 50లో వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, హిందాల్కో షేర్లు లాభాల్లో ముగిశాయి. కాగా బ్రిటానియా, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్ 1 శాతానికి పైగా పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 20 పైసలు పెరుగుదలతో 69.14 వద్ద ఉంది.