Hero Destini: త్వరలోనే మార్కెట్‌లోకి నయా వెర్షన్ హీరో డెస్టినీ.. ఇక ఆ స్కూటర్లకు గట్టి పోటీ

|

Jun 23, 2024 | 8:00 PM

చాలా కంపెనీలు ఓ పదేళ్ల కాలంలో అధునాతన ఫీచర్లతో స్కూటర్లను మార్కెట్‌లోకి లాంచా చేస్తున్నాయి. అయితే టూ వీలర్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న హీరో ఇటీవల కాలంలో స్కూటర్ సెగ్మెంట్‌లో అధిక అమ్మకాలు సాధించిన హీరో డెస్టినీ స్కూటర్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతన్నారు. ముఖ్యంగా నెక్స్ట్ జెన్ హీరో డెస్టినీ, ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్ లీక్ కావడంతో ఈ స్కూటర్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి.

Hero Destini: త్వరలోనే మార్కెట్‌లోకి నయా వెర్షన్ హీరో డెస్టినీ.. ఇక ఆ స్కూటర్లకు గట్టి పోటీ
Hero Destini 125
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో స్కూటర్లను వినియోగదారులు అధికంగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో స్కూటర్ ఉంటే అందరికీ ఉపయోగం ఉంటుందనే ఆలోచన అందరికీ ఉంటుంది. అంటే స్కూటర్లను ఇంట్లోని ఆడవాళ్లు కూడా డ్రైవ్ చేస్తారని అందువల్ల ప్రతి అవసరానికి ఉపయోగపడతాయని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఓ పదేళ్ల కాలంలో అధునాతన ఫీచర్లతో స్కూటర్లను మార్కెట్‌లోకి లాంచా చేస్తున్నాయి. అయితే టూ వీలర్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న హీరో ఇటీవల కాలంలో స్కూటర్ సెగ్మెంట్‌లో అధిక అమ్మకాలు సాధించిన హీరో డెస్టినీ స్కూటర్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతన్నారు. ముఖ్యంగా నెక్స్ట్ జెన్ హీరో డెస్టినీ, ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్ లీక్ కావడంతో ఈ స్కూటర్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో హీరో డెస్టినీ అధునాతన స్కూటర్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. 

100 సీసీ, 110 సీసీ ఇంజిన్ స్కూటర్లతో పోలిస్తే ఇటీవల కాలంలో 125 సీసీ స్కూటర్లు అధిక అమ్మకాలను సాధిస్తున్నాయి. కాబట్టి హీరో నెక్స్ట్ జెన్ హీరో డెస్టినీ 125 స్కూటర్ విడుదల చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. అయితే ఇటీవల లీకైన హీర డెస్టినీ 125 సీసీ స్కూటర్ ఈ స్కూటర్‌పై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ప్రస్తుత డెస్టినీ 125తో పోలిస్తే రాబోయే మోడల్ దాదాపు క్లాసిక్, రెట్రో స్కూటర్ వైబ్‌‌లో అలరించనుంది. ప్రస్తుత డెస్టినీ 125 ఇతర సమకాలీన కుటుంబ స్కూటర్‌ల మాదిరిగానే ఉంది. అందువల్ల రాబోయే స్కూటర్ యమహా ఫాసినో, వెస్పా స్కూటర్ల వంటి వాటికి పోటినిచ్చే స్టైలిష్, రెట్రో-లుక్‌తో రానుంది. స్లీకర్ టర్న్ ఇండికేటర్‌లు, కాంట్రాస్టింగ్ ట్రిమ్‌లతో కూడిన సరికొత్త ఆప్రాన్‌ వంటి ఫీచర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

హీరో డెస్టినీ స్కూటర్ సీటు మునుపటి కంటే మరింత స్టైలిష్ లుక్‌తో రావడంతో స్కూటర్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. తాజా హీరో డెస్టినీ 125 ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఎంపికతో వస్తుంది. అలాే అవుటర్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ వంటి ఫీచర్లతో ఈ స్కూటర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. 124.6 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ని 9 బీహెచ్2పీ, 10.4 ఎన్ఎం ఐ3ఎస్ స్టాప్/స్టార్ట్ ఫీచర్‌తో వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇన్ని ఫీచర్లతో వచ్చే హీరో డెస్టినీ స్కూటర్ ధర గతంలో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉండనుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి