Solar Panels: కొత్తతరం సోలార్ ప్యానెల్.. రాత్రిపూట కూడా విద్యుత్ ఉత్పత్తి..!

|

Apr 10, 2022 | 9:16 PM

Solar Panels: రాత్రిపూట కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేసే సోలార్‌ ప్యానెల్‌ను ఇంజనీర్లు రూపొందించారు. ఇప్పుడు మనం చూసే సోలార్ ప్యానెల్ ఏదైనా పగటిపూట మాత్రమే విద్యుత్తును

Solar Panels: కొత్తతరం సోలార్ ప్యానెల్.. రాత్రిపూట కూడా విద్యుత్ ఉత్పత్తి..!
Solar Panel
Follow us on

Solar Panels: రాత్రిపూట కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేసే సోలార్‌ ప్యానెల్‌ను ఇంజనీర్లు రూపొందించారు. ఇప్పుడు మనం చూసే సోలార్ ప్యానెల్ ఏదైనా పగటిపూట మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే దానికి సూర్యకాంతి అవసరం. దీనివల్ల బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆ బ్యాకప్ నుంచి రాత్రి విద్యుత్‌ని వినియోగించవచ్చు. సౌర ఫలకాల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ చాలా పనులను చేస్తుంది. కానీ నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తి కాకపోవడంతో రాత్రిపూట కొన్ని పనులు ఆగిపోతున్నాయి. కొత్త యుగం సోలార్ ప్యానెల్స్ ఇలా ఉండదు. దీని నుంచి పగలు, రాత్రి నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేయవచ్చు. ఈ కొత్త సోలార్ ప్యానెల్‌ను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ (కాలిఫోర్నియా, USA) ఇంజనీర్లు కష్టపడి తయారు చేశారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, సరఫరా కోసం ఈ సోలార్ ప్యానెల్ రూపొందించారు. ‘ఇండియా టైమ్స్’ నివేదిక ప్రకారం.. ఈ కొత్త యుగం సోలార్ ప్యానెల్ పగలు, రాత్రి రెండింటిలోనూ సమానంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ప్యానెల్ గురించిన వివరణాత్మక అధ్యయనం అప్లైడ్ ఫిజిక్స్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురించారు.

విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది..?

వాస్తవానికి రాత్రిపూట విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది. అది సాధ్యమేనా అని మీకు అనుమానం రావొచ్చు. నిజమే రాత్రిపూట సూర్యకాంతి ఉండదు. అయితే దీనికి సమాధానంగా ఇంజనీర్లు థర్మోఎలెక్ట్రిక్ జనరేటర్‌ను రూపొందించారు. ఈ జనరేటర్ సోలార్ ప్యానెల్, గాలి, ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ద్వారా ఉత్పత్తి అయిన శక్తిని విద్యుత్‌గా మారుస్తుంది. ఇప్పుడు ఈ సోలార్ వ్యవస్థ పగటిపూట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా రాత్రి కూడా కొనసాగుతుంది. దీంతో రాత్రిపూట కూడా స్టాండ్ బై లైటింగ్ వ్యవస్థ ఉంటుంది.

2021 సంవత్సరంలో అనేక విజయాలు

పవన శక్తి, సౌర శక్తి, బొగ్గు శక్తిని అధిగమించినందున 2021 సంవత్సరం పునరుత్పాదక శక్తికి ఉత్తమ సంవత్సరంగా పరిగణిస్తున్నారు. పవన, సౌరశక్తి మొత్తం భూమిపై 38 శాతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. సౌర, పవనాల నుంచి 10 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దేశాలు 50 ఉన్నాయి. రాత్రిపూట విద్యుత్తును ఉత్పత్తి చేసే సౌర ఫలకాల ప్రయోజనం ఏంటంటే చిన్న చిన్న గ్రామాలకి విద్యుత్‌ సమస్య పరిష్కారమవుతుంది.

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్‌.. ఈ కంపెనీ వాహనాలు ఫస్ట్‌ ప్లేస్‌..!

Viral Photos: ఇతడొక విచిత్రమైన వ్యక్తి.. గ్రహాంతరవాసికేమి తీసిపోడు..!

Health Tips: కీరదోసలో అద్భుత పోషకాలు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!