
కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డు రూల్స్‌లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి మీ పేరుపై ఎన్ని కావాలంటే అన్ని సిమ్ కార్డులు తీసుకోలేరు. ఈ మేరకు కేంద్రం ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఒక వ్యక్తి పేరుపై 9 కనెక్షన్ల ఉంటే.. కొత్త కనెక్షన్లు మంజూరు చేయవద్దని టెలికాం కంపెనీలకు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇలాంటి చందాదారులను గుర్తించి వారికి కొత్త కనెక్షన్లు మంజూరు చేయకుండా నిరోధించాలని సూచించింది. ఆగస్ట్ 24 నుంచి ఇందుకు సంబంధించి సాంకేతిక, సంస్థాగత చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిమితికి మంచి సిమ్ కార్డులు పొందినవారి పేర్లు డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు డాట్ సూచించింది.

ఇక తొమ్మిది కనెక్షన్లకు మించి సిమ్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తుల ఫొటోలను డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్రం కోరింది. దీని వల్ల గరిష్ట పరిమితికి మించి కనెక్షన్లు ఉన్నవారిని గుర్తించి వారికి కొత్త కనెక్షన్లు మంజూరు చేయకుండా ఉండటానికి ఈ చర్య ఉపయోగపడుతుంది. నవంబర్ 30లోపు డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్‌ఫామ్స్‌తో ప్రక్రియను క్రమబద్దీకరించాలని కోరింది.

కస్టమర్ అప్లికేషన్ ఫారం నిబంధనలు, షరతుల ప్రకారం ఒక టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అటువంటి చర్యలు అమలు చేయబడే వరకు మొబైల్ కనెక్షన్ల కోసం అనుమతించే పరిమితిని దాటిన సమస్య పరిష్కారం అయ్యే వరకు ఒక రోజులో నిర్దేశిత పరిమితికి మించి యాక్టివ్ చేయబడ్డ ఏదైనా సిమ్ కార్డు తక్షణమే నిలిచివేయబడుతుందని పేర్కొంది.

చాలామంది వివిధ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సిమ్ కార్డులను తీసుకుంటూ ఉంటారు. ఒకే పేరుపై అనేక కనెక్షన్లను కలిగి ఉంటారు. ఇక కొత్త సిమ్ కార్డు ఇచ్చేటప్పుడు ఫొటోతో సరిపోల్చేలా కొత్త విధానం తీసుకొచ్చారు. అయితే సంచార్ సౌథీ పోర్టల్‌లోకి వెళ్లి మీ పేరుపై ఉన్న సిమ్ వివరాలను చెక్ చేసుకోవచ్చు.