New Banking System: ఏప్రిల్ నుండి అన్ని బ్యాంకుల వెబ్ చిరునామా మార్పు.. కొత్త డొమైన్ ఏంటి?

New Banking System: డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న మోసాలను నివారించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. ఇది డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపు సేవలపై వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ కొత్త డొమైన్‌కు ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్..

New Banking System: ఏప్రిల్ నుండి అన్ని బ్యాంకుల వెబ్ చిరునామా మార్పు.. కొత్త డొమైన్ ఏంటి?

Updated on: Feb 09, 2025 | 6:35 PM

ఆర్థిక మోసాలను అరికట్టడానికి భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేక ‘.bank.in’ ఇంటర్నెట్ డొమైన్‌ను ప్రారంభించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. భారతీయ బ్యాంకుల కోసం రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ Bank.inను అమలు చేయబోతోంది. ఈ విధానం ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. చట్టబద్ధమైన బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లు, మోసపూరిత వెబ్‌సైట్‌ల మధ్య తేడాను గుర్తించడంలో కస్టమర్‌లకు సహాయపడటం ఈ విధానం లక్ష్యం.

bank.in డొమైన్ అంటే ఏమిటి?

“భారతీయ బ్యాంకుల కోసం రిజర్వ్ బ్యాంక్ ‘bank.in’ ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్‌ను అమలు చేస్తుంది. ఈ డొమైన్ పేరు నమోదు ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. ఇది బ్యాంకింగ్ మోసాలను నివారించడంలో సహాయపడుతుంది. దీని తరువాత, ఆర్థిక రంగానికి ‘fin.in’ డొమైన్‌ను స్వీకరించనున్నారు” అని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.

ఇవి కూడా చదవండి

కొత్త డొమైన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

‘bank.in’ డొమైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 2025 నుండి ప్రారంభమవుతుంది. దీని తరువాత RBI ఆర్థిక రంగం, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (NBFC) కోసం ‘fin.in’ డొమైన్‌ను తీసుకువస్తుంది.

ఇది కూడా చదవండి: Ratan Tata: రతన్‌ టాటా వీలునామాలో ఈ రహస్య వ్యక్తికి రూ.500 కోట్లు.. ఈ మిస్టరీ మ్యాన్‌ ఎవరు?

bank.in డొమైన్ ఎందుకు ?

డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న మోసాలను నివారించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. ఇది డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపు సేవలపై వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ కొత్త డొమైన్‌కు ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (IDRBT) ప్రత్యేక రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.

అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపులకు కొత్త భద్రతా వ్యవస్థ:

అంతర్జాతీయ ఆన్‌లైన్ లావాదేవీలలో (కార్డ్ నాట్ ప్రెజెంట్ ట్రాన్సాక్షన్స్) భద్రతను పెంచడానికి ఆర్‌బిఐ అదనపు ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA)ను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఇప్పటివరకు భారతదేశంలో జరిగే డిజిటల్ లావాదేవీలకు మాత్రమే AFA భద్రతా లక్షణం తప్పనిసరి. ఇప్పుడు ఇది అంతర్జాతీయ ఆన్‌లైన్ చెల్లింపులలో కూడా అమలు చేయబడుతుంది.

ఇది కూడా చదవండి: Tax Saving Scheme: పన్ను ఆదా చేసుకునే 7 ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి