Pan Card: పాన్ కార్డులో మీ సిగ్నేచర్ మార్చుకోవాలా..? సెకన్లలోనే అప్డేట్ చేసుకోవచ్చు.. ఫీజు ఎంతంటే..?

పాన్ కార్డులో వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నాయా.. అయితే మీరు సులువుగా ఆన్ లైన్ ద్వారా మార్చుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దే ఉండి స్మార్ట్‌ఫోన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

Pan Card: పాన్ కార్డులో మీ సిగ్నేచర్ మార్చుకోవాలా..? సెకన్లలోనే అప్డేట్ చేసుకోవచ్చు.. ఫీజు ఎంతంటే..?
Pan Card

Updated on: Jun 20, 2026 | 12:47 PM

దేశంలో ఉన్నవారికి పాన్ కార్డ్ ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కేవలం ఒక గుర్తింపు ధృవీకరణ పత్రంగానే కాకుండా ఆర్ధిక లావాదేవీలను సక్రమంగా నిర్వహించడంలో ఉపయోగపడుతుంది. బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతీఒక్కరికీ అవసరం. దీంతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు అనేది తప్పనిసరి. పాన్ లేకుండా మీరు బ్యాంక్ అకౌంట్ తెరవలేరు. అలాగే మీరు ఉద్యోగం చేస్తుంటే జీతం పొందాలన్నా పాన్ అవసరం. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే పాన్ లేకుండా పని అవ్వదు. ఇంత ముఖ్యమైన డాక్యుమెంట్‌లో మీరు వివరాలన్నీ సక్రమంగా ఉండేలా చేసుకోవాలి. అస్పష్టంగా ఉంటే ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవచ్చు.

సంతకం కూడా మార్చుకోవచ్చు..

పేరు, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు, లింగం, అడ్రస్, ఫొటో, సంతకం ఇలా మీరు పాన్ కార్డులోని ప్రతీ సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవచ్చు. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ డిజిటల్ సేవలు అందిస్తోంది. పాన్ కార్డులో ఉన్న సంతకాన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. అయితే ఎలా మార్చుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. అయితే మీరు కేవలం రూ. 107 చెల్లించి ఆన్‌లైన్‌లో సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాపెస్ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఆన్‌లైన్ ద్వారా మార్చుకోవడం  ఎలా..

-NSDL పాన్ పోర్టల్‌ను సందర్శించండి

-అనంతరం Select Changes అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

– ఆ తర్వాత Changes or Correction in Existing PAN Dataను ఎంచుకోండి

– ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా అందించాలి

-అవసరమైన పత్రాలు, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి

-వినియోగదారుడు నిర్దేశించిన రూ. 107 రుసుమును చెల్లించాలి

– ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది

-ఓటీపీ ఎంటర్ చేశాక ధృవీకరణ ప్రక్రియ పూర్తవుతుంది

-మీ ఫోన్‌కు అక్‌నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది

-ఈ నెంబర్ ఆధారంగా మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు

ఆఫ్‌లైన్‌లో మార్చుకోవడం ఎలా అంటే..?

ఇక ఆఫ్లైన్ ద్వారా మార్చుకోవాలంటే సమీపంలోని పాన్ కార్యాలయానికి వెళ్లండి. లేదా ఆధీకృత ఏజెంట్లను సంప్రదించండి. దరఖాస్తు ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి. ఫీజు చెల్లించి మీ సంతకాన్ని అప్డేట్ చేసుకోండి. ఇలా మీరు ఆఫ్‌లైన్‌లో కూడా సంతకాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా ఆన్‌లైన్, ఆప్‌లైన్ రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

 

Follow Us