
అత్యవసరంగా డబ్బులు కావాల్సినప్పుడు ఏం చేస్తారు? సాధారణంగా మన స్నేహితులను చేబదులు అడుగుతాం.. లేదా బయట వడ్డీకి తెచ్చుకుంటాం.. అయితే ఇటీవల కాలంలో మూడో వ్యక్తికి తెలియకుండా.. ఇంట్లో కూర్చొనే అవసరాన్ని తీర్చుతున్నాయి వ్యక్తిగత రుణాలు(పర్సనల్ లోన్లు). ఆన్ లైన్ మార్గాల్లో సులభంగా లోన్లు మంజూరవుతున్నాయి. ఈ క్రమంలో అందరూ వీటిని వినియోగిస్తున్నారు. వీటికి ఎటువంటి పూచీకత్తు ఉండదు. తనఖా కూడా ఉండదు. కేవలం సిబిల్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు మంజూరు చేసేస్తాయి. అన్ని బ్యాంకులు ఈ పర్సనల్ లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. కెనరా బ్యాంకు కూడా ఆన్ లైన్ పర్సనల్ లోన్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇంట్లో కూర్చొని నిమిషాల్లో అవసరమైన మొత్తాన్ని మీరు లోన్లుగా తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు చాలా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాన్ని అందజేస్తోంది.. మీరు ఇంట్లో కూర్చొని, మీ మొబైల్ ఫోన్ నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో రూ. 25000 నుంచి రూ.10 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
మీ వయస్సు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటే, మీరు కెనరా బ్యాంక్‌లో పర్సనల్ లోన్ తీసుకోవడానికి అర్హులు. మీరు కెనరా బ్యాంక్‌లో చాలా సులభంగా పర్సనల్ లోన్ పొందవచ్చు. దీని కోసం, మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు మీ సమీపంలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించి, దరఖాస్తు ఫారమ్‌ను తీసుకోవడం ద్వారా పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదా ఆన్ లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..