New Electric Motorcycle: స్పోర్టీ లుక్‌లో కేక పెట్టిస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌.. సింగిల్‌చార్జ్‌పై 140కిమీ..

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ స్టార్ట్‌ ప్‌ కంపెనీ ఎంఎక్స్‌మోటో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ బైక్‌ మోడల్‌ని లాంచ్‌ చేసింది. ఈ స్టార్ట్‌ ప్‌ కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్న కోమాకీకి సబ్ బ్రాండ్. కాగా ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ పేరు ఎంఎక్స్‌9. దీని ప్రారంభ ధర రూ. 1.46లక్షలు(ఎక్స్‌ షోరూం) ఉంటుంది. ఇది సింగిల్‌ చార్జ్‌ పై 140కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది డ్యూయల్‌ టోన్‌ గ్రే, బ్లాక్‌ ఫినిష్‌, బ్లాక్‌ కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

New Electric Motorcycle: స్పోర్టీ లుక్‌లో కేక పెట్టిస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌.. సింగిల్‌చార్జ్‌పై 140కిమీ..
Mxmoto Mx9 Electric Motorcycle

Updated on: Sep 20, 2023 | 7:30 AM

విద్యుత్‌శ్రేణి వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. మన దేశంలో పెద్ద సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు లాంచ్‌ అవుతున్నాయి. వాస్తవానికి స్కూటర్ల శ్రేణిలో చాలా పోటీ వాతావరణం నెలకొంది. అయితే బైక్‌లను మాత్రం చాలా తక్కువ కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలోని ఎలక్ట్రిక్‌ వెహికల్‌ స్టార్ట్‌ ప్‌ కంపెనీ ఎంఎక్స్‌మోటో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ బైక్‌ మోడల్‌ని లాంచ్‌ చేసింది. ఈ స్టార్ట్‌ ప్‌ కంపెనీ ఇప్పటికే స్కూటర్లను అందిస్తున్న కోమాకీకి చెందినది. కాగా ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ పేరు ఎంఎక్స్‌9. దీని ప్రారంభ ధర రూ. 1.46లక్షలు(ఎక్స్‌ షోరూం) ఉంటుంది. ఇది సింగిల్‌ చార్జ్‌ పై 140కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది డ్యూయల్‌ టోన్‌ గ్రే, బ్లాక్‌ ఫినిష్‌, బ్లాక్‌ కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఎంఎక్స్‌9 ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎంఎక్స్‌9 ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ స్పెసిఫికేషన్లు ఇవి..

ఈ మోటార్‌ సైకిల్‌లో 3.2కేడబ్ల్యూహెచ్‌ ఎల్‌ఐపీఓ4 బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది నాలుగు గంటల్లోనే ఫుల్‌ చార్జ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఒకసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే కనీసం 120 నుంచి 140కిలోమీటర్ల ప్రయాణించగలుగుతుంది పేర్కొంది. ఈ బైక్‌ 4,000 వాట్ల హబ్‌ మోటార్‌ను కలిగి ఉంది. ఇది 148ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
దీనికి 17 అంగుళాల చక్రాలు అమర్చబడి ఉంటాయి. 60ఏఎంపీ కంట్రోలర్‌, రీజనరేటివ్‌ బ్రేకింగ్‌, ఎనర్జీ పొదుపు ఫీచర్లు ఉంటాయి. వీటిని సక్రమంగా వినియోగించడం ద్వారా 16శాతం ఎనర్జీ సేవ్‌ అవుతుందని కంపెనీ ప్రకటించింది.

ఎంఎక్స్‌9 ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ ఫీచర్లు ఇవే..

ఈ బైక్‌లో టీఎఫ్‌టీ స్క్రీన్‌, యాప్‌ ఇంటిగ్రేటెడ్‌ సౌండ్‌ సిస్టమ్‌, క్రూయిజ్‌కంట్రోల్‌, రివర్స్‌ అసిస్ట్‌, యాంటీ స్కిడ్‌/హిల్‌ అసిస్ట్‌, పార్కింగ్‌ అసిస్ట్‌ వంటి ఆప్షన్లు ఉన్నాయి. సస్పెన్షన్‌ విషయానికి వస్తే సెంట్రల్‌ షాక్‌ అబ్జార్బర్‌, అడ్జస్టబుల్‌ రియర్‌ సస్పెన్షన్‌ ఉంటుంది. ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ టర్న్‌ ఇండికేటర్లు, రెండు వైపులా డిస్క్‌బ్రేక్‌లు ఉంటాయి. చూడటానికి ట్రెండీ లుక్ లో ఈ బైక్ కనిపిస్తోంది. స్పోర్టీ డిజైన్ ఉంది. యువతను ఈ బైక్ బాగా ఆకర్షించే అవకాశం ఉంది. పైగా రేంజ్ కూడా బాగా ఉండటంతో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ఈ బైక్ ధర రూ. 1.46లక్షలు(ఎక్స్‌ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఉంటున్న రాష్ట్రం, సిటీని బట్టి రేటులో మార్పు ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..