Bullet Train: వారెవ్వా.. తొలి బుల్లెట్ ట్రైన్‌లో ఇన్ని సౌకర్యాలా..? ఈ ఫీచర్లు చూస్తే అబ్బురపడాల్సిందే..

వచ్చే ఏడాదిలో దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది. ఇప్పటికే బెంగళూరులో తొలి రైలు రూపుదిద్దుకుంటోంది. ఈ రైల్లో అత్యాధునిక ఫీచర్లు ఉండనున్నాయి. ఇప్పటివరకు ఏ ట్రైన్లో అందుబాటులోకి లేని మోడ్రన్ సౌకర్యాలు ఈ రైల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫీచర్ల గురించి తెలుసుకుంటే వారెవ్వా అనాల్సిందే..

Bullet Train: వారెవ్వా.. తొలి బుల్లెట్ ట్రైన్‌లో ఇన్ని సౌకర్యాలా..? ఈ ఫీచర్లు చూస్తే అబ్బురపడాల్సిందే..
Bullet Train

Updated on: Nov 03, 2026 | 1:58 PM

దేశంలో ప్రారంభం కానున్న తొలి బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించి ఆశ్చర్యపోయే విషయాలు బయటకొచ్చాయి. ఈ ట్రైన్‌లో ఉండే సౌకర్యాలు, స్పీడ్, ఇతర ఫీచర్ల వివరాలు తెలుసుకుంటే వారెవ్వా అనాల్సిందే. వచ్చే ఏడాదిలో ముంబై-అహ్మదాబాద్ మార్గంలో తొలి బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతుండగా.. తొలి బుల్లెట్ రైలు అనేక ప్రత్యేకతలను సంతరించుకోనుంది. బీ 28 లేదా బీ 28 అని పిలవబడే ఈ ట్రైన్‌లో మొత్తం 8 కోచ్‌లు ఉంటాయి. ఒకేసారి 557 మంది ఇందులో ప్రయాణించవచ్చు. గరిష్టంగా గంటకు 249 కిలోమీటర్ల వేగంత ఈ రైలు సర్వీసులు అందించనుంది.

బుల్లెట్ రైలు ప్రత్యేకతలు ఇవే..

ఇప్పటికే రైల్వేశాఖ బుల్లెట్ రైలు నమూనాలను విడుదల చేసింది. ప్రస్తుతం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) ప్లాంట్‌లో స్వదేశీ టెక్నాలజీతో తొలి బుల్లెట్ రైలు తయారుచేస్తున్నారు. ఇది భద్రతా పరీక్షల దశలో ఉంది. గరిష్టంగా గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో దీనిని అభివృద్ది చేస్తున్నారు. అయితే ఇది 240 కిలోమీటర్ల వేగంతో తిరగనుంది. ఏడు స్టాండర్డ్-క్లాస్ కోచ్‌ల‌తో పాటు ఒక ఎగ్జిక్యూటివ్-క్లాస్ కోచ్ ఈ రైల్లో ఉంటాయి. ఇక రైలు మొత్తం వై-ఫై కనెక్టివిటీ కలిగి ఉండటంతో పాటు ఛార్జింగ్ పాయింట్లు, పెద్ద కిటికీలు, దివ్యాంగుల కోసం వారికి అనుకూలంగా ఉండే ప్రత్యేక టాయిలెట్లు,శారీరక వైకల్యం ఉన్న ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

ఈ ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..

తొలి బుల్లెట్ రైలు సెట్ పొడవు 202 మీటర్లు ఉంటుంది. నాలుగు మోటార్ కార్లు, నాలుగు ట్రైలర్ కార్లతో కూడిన 8 కోచ్‌లు ఉంటాయి. 3×2 సీటింగ్‌తో ఏడు స్టాండర్డ్-క్లాస్ కోచ్‌లు. 2×2 సీటింగ్‌తో ఒక ఎగ్జిక్యూటివ్-క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఇక ట్రైన్‌కు రెండు చివర్లలో డ్రైవర్ క్యాబ్‌లు ఉంటాయి. అలాగే LED లైటింగ్, లగేజీ ర్యాక్‌లు, వస్తువులు పెట్టుకునేందుకు ప్రత్యేక స్టోరేజ్ స్టాండ్‌లు, ప్రతి ప్రయాణీకునికి ప్రత్యేక పవర్ అవుట్‌లెట్‌లు అందుబాటులో ఉంటాయి. ఇక కోచ్ లోపల ఉండే ఎల్‌సిడి డిస్‌ప్లేలు ప్రాంతీయ భాషల్లో సమాచారం అందిస్తాయి. ఇక అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందితో మాట్లాడేందుకు ప్రత్యేక ఎమర్జెన్సీ యూనిట్లు ఉంటాయి. అలాగే అత్యాధునిక బయో డైజెస్టర్ టాయిలెట్లు ఏర్పాటు చేయునున్నారు.  హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాలు వీటిల్లో ఉంటాయి. దృష్టి లోపం ఉన్నవారికి బ్రెయిలీ సమాచార సంకేతాలు ఉంటాయి. ఇక వీల్ చైర్లకు అనుకూలంగా డోర్లు ఏర్పాటు చేస్తున్నారు. రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని ఈ బుల్లెట్ ట్రైన్‌లో ఉపయోగిస్తున్నారు. రైలు వేగం తగ్గినప్పుడు శక్తి వినియోగం దీని వల్ల తగ్గుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us