
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు పెట్టింది పేరు స్టాక్ మార్కెట్. మనం ఏదైనా మంచి గ్రోత్ ఉన్న కంపెనీలో డబ్బు దాచిపెట్టి.. అలాగే ఓపికతో వెయిట్ చేస్తే కచ్చితంగా ఆ చిన్న ఇన్వెస్ట్‌మెంట్ మనకు కోట్లు తెచ్చిపెడుతుంది. అందుకు ఉదాహరణగా నిలుస్తూ.. ఎన్‌ఎస్‌సీలో చాలానే స్టాక్స్ ఉన్నాయి. సరిగ్గా అలాంటి స్టాక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
బజాజ్ ఫైనాన్స్.. ఈ టూ వీలర్ కంపెనీ మొదటిగా 1994లో ఐపీఓగా వచ్చింది. అప్పుడు ‘బజాజ్ ఆటో ఫైనాన్స్ లిమిటెడ్’ పేరిట లిస్టింగ్ అయింది. ఆ తర్వాత కంపెనీ తన పేరును 2010లో మార్చుకుంది. అయితే తన పేరెంట్ కంపెనీతో ఆపరేటింగ్ అవుతున్న సమయంలో ఈ బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర అనగా 2002వ సంవత్సరం సమయంలో రూ 0.58 పైసలుగా ఉంది. ఆ సమయంలో మీరు ఓ లక్ష రూపాయలు ఈ స్టాక్‌లో పెట్టి ఉంటే.. ఇప్పుడు అవి కోట్లు రాబట్టేవి. FIIs, DIIs స్టేక్ హోల్డింగ్ ఎక్కువగా ఉన్న ఈ కంపెనీ ఆపై ఎలాంటి అభివృద్ధి బాట పట్టిందో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో లక్షకు సుమారు 1,72,413 షేర్స్ వస్తాయి. ఇక ఇప్పుడు.. ప్రస్తుతం సమయానికి ఆ షేర్స్ విలువ సుమారు రూ. 184 కోట్లుగా ఉంది. మొన్నీమధ్య ఈ షేర్ వాల్యూ సుమారు రూ. 9 వేల వరకు వెళ్ళింది. అయితే బోనస్, స్ప్లిట్ కారణంగా మళ్లీ అది వెయ్యికి దిగింది. ప్రస్తుతం రూ. 1,069 దగ్గర రన్ అవుతోంది. ఈ లెక్క ప్రకారమే.. అప్పటి మీ లక్ష రూపాయలు.. ఇప్పుడు రూ. 184 కోట్లుగా మారతాయి. స్టాక్ మార్కెట్ ఓ చదరంగమే.. కానీ కచ్చితత్వం ఉన్న షేర్స్‌లో పెడితే.. ఓపిక.. ఇన్నేళ్ల కంపౌండింగ్‌తో మీ డబ్బు డబుల్ కాదు ట్రిపుల్ లేదా 10 టైమ్స్ పెరగడం ఖాయం.