Stock Market: లక్ష పెట్టుబడి.. ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం!.. ఇది సాధ్యమే..

|

Oct 03, 2021 | 8:03 PM

అత్యంత త్వరగా డబ్బులు సంపాదించాలంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటారు. స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడి పెట్టిన వారందరికి లాభాలొస్తాయా అంటే.. రావనే చెప్పాలి...

Stock Market: లక్ష పెట్టుబడి.. ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం!.. ఇది సాధ్యమే..
Stock Markets
Follow us on

అత్యంత త్వరగా డబ్బులు సంపాదించాలంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటారు. స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడి పెట్టిన వారందరికి లాభాలొస్తాయా అంటే.. రావనే చెప్పాలి. స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడి పెట్టి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. మరి ఎలా అంటారా.. ఖచ్చితమైన అవగాహనతో స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మంచి రిటర్స్‎ను వస్తాయి. ఇలా ఓ స్టాక్ ఇన్వెస్టర్లకు లక్షలు కురిపించింది. ఐదేళ్ల కింద లక్ష పెడితే ఇప్పుడు దాని విలువ రూ. 40 లక్షలకు చేరుకుంది.

క్వాలిటీ ఫార్మా కంపెనీ మదుపర్లకు ఎనలేని లాభాలను తెచ్చిపెట్టింది. ఐదేళ్ల క్రితం (2016, సెప్టెంబర్‌ 28) ఈ కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో రూ.21.75గా ఉండేది. 2021, అక్టోబర్‌ 1న ఆ షేరు రూ.878 వద్ద ముగిసింది. అంటే దాదాపు 40 రెట్లు పెరిగింది. ఇంకా చెప్పాలంటే చివరి నెల్లోనే ఈ షేరు ధర రూ.419 నుంచి రూ.878కి చేరుకుంది. దాదాపుగా 110 శాతం ర్యాలీ చేసింది. ఆరు నెలల క్రితం వరకు ఈ షేరు ధర రూ.54గానే ఉండటం గమనార్హం. అంటే అర్ధ సంవత్సరంలోనే 1530 శాతం పెరిగిందన్నమాట. ఇక ఏడాది క్రితం ఈ షేరు ధర రూ.61 మాత్రమే. మొత్తంగా ఐదేళ్ల కాలంలో రూ.21 నుంచి రూ.878 స్థాయికి చేరుకుంది. 3,940 శాతం పెరిగింది.

క్వాలిటీ ఫార్మాలో మదుపర్లు ఒక నెల క్రితం లక్ష రూపాయాలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.2.10 లక్షలు చేతికందేవి. అదే ఆరు నెలల క్రితం లక్ష పెట్టుంటే ఇప్పుడు రూ.16.30 లక్షలు వచ్చేవి. అదే ఏడాది క్రితం లక్ష పెట్టు బడి పెడితే ఈనాడు రూ.14.40 లక్షల రాబడి వచ్చేది. పదేళ్ల క్రితం ఈ మల్టీబ్యాగర్‌ స్టాక్‌లో లక్ష పెట్టుంటే ఇప్పుడు రూ.40 లక్షల లాభం వచ్చేది. అయితే ఈ స్టాక్ 2016 నుంచి 2020 వరకు చాలా తక్కువ స్థాయిలో పెరిగింది. 2020 నుంచి 2021 ఏప్రిల్ వరకు ఓ మొతాదులో పెరిగిన ప్రైస్ జూన్ నుంచి ర్యాలీ అవుతూ వస్తోంది. అయితే భవిష్యత్తులో ఈ స్టాక్ ప్రైస్ పెరుగొచ్చు లేక తగ్గొంచు.. ఎందుకంటే ఒకప్పుడు రూ. 393 ఉన్న యస్ బ్యాంకు షేరు ధర ప్రస్తుతం రూ.13గా ఉంది.

Read Also..Stock Market: పడుతున్న స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడికి ఇదే సరైన సమయమా.. వచ్చే వారం ఎలా ఉండబోతుంది?