Mukesh Ambani: రిలయన్స్ జోరు.. అంబానీకి కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!

Mukesh Ambani: ముఖేష్ అంబానీ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గత నాలుగు రోజులుగా తన పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందిస్తూ, వారి లాభాలను కురిపించింది. ఈ కాలంలో రిలయన్స్ షేర్లు దాదాపు 9% పెరిగాయి. దీంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.36 లక్షల కోట్లకు చేరింది. దీని ప్రకారం.. రిలయన్స్ పెట్టుబడిదారుల సంపద రూ.1.39 లక్షల కోట్లు పెరిగింది.

Mukesh Ambani: రిలయన్స్ జోరు.. అంబానీకి కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
Mukesh Ambani

Updated on: May 04, 2026 | 4:19 PM

Mukesh Ambani: గత వారంలో షేర్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఇన్వెస్టర్లు మాత్రం భారీ లాభాలను గడించారు. మే 1న సెలవు కావడంతో గత వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ జరిగింది. ఈ స్వల్ప కాలంలోనే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Cap) ఊహించని రీతిలో పెరిగింది.

భారీ లాభాలు: గత నాలుగు పనిదినాల్లో రిలయన్స్ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 1.39 లక్షల కోట్లు పెరిగింది. ఈ కాలంలో రిలయన్స్ షేరు సుమారు 9 శాతం మేర లాభపడింది. తాజా పెరుగుదలతో రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 19.36 లక్షల కోట్లకు చేరుకుంది.

టాప్ పెర్ఫార్మర్: సెన్సెక్స్‌లోని టాప్-10 కంపెనీల్లో రిలయన్స్ అత్యధిక లాభాలను ఆర్జించి మొదటి స్థానంలో నిలిచింది. రిలయన్స్‌తో పాటు టీసీఎస్ (TCS), భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ కూడా లాభపడ్డాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Reserves: ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ ఉంది?

మిగిలిన కంపెనీల పరిస్థితి:

ఒకవైపు రిలయన్స్ దూసుకుపోతుంటే, మరోవైపు బ్యాంకింగ్ రంగానికి చెందిన దిగ్గజ కంపెనీలు మాత్రం నష్టాలను చవిచూశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ విలువ సుమారు రూ. 30,900 కోట్లు పడిపోయింది.

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ కూడా రూ. 20,900 కోట్లకు పైగా తగ్గింది.

ICICI Bank: ఈ బ్యాంక్ ఇన్వెస్టర్లు కూడా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ తన నంబర్-1 స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఇది కూడా చదవండి: WhatsApp: సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ లిస్టులో ఉందేమో చెక్ చేసుకోండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us