Insurance: సినిమాలకూ..వెబ్ సిరీస్ లకూ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది.. కానీ, ఆ పాలసీలు వేరే..వినోదరంగంలో ఇన్సూరెన్స్!

|

Jun 30, 2021 | 5:14 PM

Insurance: ఇప్పుడు కరోనా.. ప్రకృతి వైపరీత్యాల పెరుగుదలతో, సినిమాలు మాత్రమే కాకుండా, టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్ నిర్మాతలు కూడా సినిమా బీమా వైపు మొగ్గు చూపుతున్నారు.

Insurance: సినిమాలకూ..వెబ్ సిరీస్ లకూ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది.. కానీ, ఆ పాలసీలు వేరే..వినోదరంగంలో ఇన్సూరెన్స్!
Movie Insurance
Follow us on

Insurance: ఇప్పుడు కరోనా.. ప్రకృతి వైపరీత్యాల పెరుగుదలతో, సినిమాలు మాత్రమే కాకుండా, టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్ నిర్మాతలు కూడా సినిమా బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ పెరిగింది అలాగే రిస్క్ కూడా పెరిగింది. అందుకే ఫిల్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు కూడా పెరిగాయి. మొత్తం వినోద రంగంలో మందగమనంలో ఉంటె.. సినిమా బీమా రంగం మాత్రం వేగంగా పరుగులు తీస్తోంది. సాధారణంగా అన్ని బీమాలకు ఒక నిర్దిష్ట ప్యాకేజీ ఉంటుంది. దానిప్రకారం బీమా చేసుకునే అవకాశం ఉంది. కానీ, సినిమాలకు మాత్రం ఇలా రెడీమెడ్ బీమా ప్యాకేజీలు లేవు. ఏ సినిమాకు తగ్గట్టుగా దానికి బీమా ప్యాకేజీ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ అదేవిధంగా న్యూ ఇండియా అస్యూరెన్స్ వంటి కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు సినిమా బీమాను అందిస్తున్నాయి. సినిమా బడ్జెట్ పెరిగితే బీమా మొత్తం పెరుగుతుంది. నటీనటులు ఎంత పెద్దవారు, సెట్లు ఎంత ఖరీదైనవి.. ఎలాంటి స్టంట్స్ ఉన్నాయి, లొకేషన్ లో షూటింగ్ ఎలా ఉంది.. సినిమా పై ఇంతకు ముందు ఏదైనా వివాదం ఉందా? అటువంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని, బీమా చేసిన మొత్తం నిర్ణయిస్తారు.

చాలా సినిమాల్లో బీమా మొత్తం 15 నుంచి 50 కోట్లు. కానీ, ఇప్పుడు పెద్ద బడ్జెట్ చిత్రాలు మాత్రమే కాదు, ఒటీటీ సిరీస్ లు కూడా పెరుగుతున్నాయి. వారికి 100 కోట్లకు పైగా బీమా చేస్తున్నారు. ‘బాహుబలి’కి 200 కోట్ల బీమా చేశారు. ఒటీటీ సిరీస్ ‘ఫర్గాటెన్ ఆర్మీ’కి 120 కోట్ల బీమా ఉంది. ఇటీవల ఒక చిత్రానికి బీమా నిమిత్తం 1.90 కోట్ల ప్రీమియం చెల్లించారు. మూవీ ఇన్సూరెన్స్ ప్రీమియం నుండి 100 కోట్ల వరకు ఆదాయం ఇన్స్యూరెన్స్ కంపెనీలకు వస్తోంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.ఎస్. రామ్‌కుమార్ సినిమా ఇన్సూరెన్స్ మార్కెట్లో ప్రీమియం ఆదాయం 100 కోట్లకు పైగా ఉందని చెబుతున్నారు. అయితే, భీమా తీసుకునే ప్రాజెక్టుల సంఖ్య, ప్రీమియం రేట్ల పెరుగుదలతో, ఈ మార్కెట్ త్వరలో రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు.

ఇంతకుముందు కొంతమంది నిర్మాతలు తమ చిత్రం కోసం రుణం ఇచ్చే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థతో ఒప్పందం కోసం మాత్రమే బీమా తీసుకునేవారు. కానీ ఇప్పుడు అవగాహన పెరిగింది. సెక్షన్ 144 విధించడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుందని కొందరు నిర్మాతలు పేర్కొన్నారు కానీ, ఇటువంటి వాటిని ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించలేదు. అంతకుముందు పాండమిక్ రిస్క్ కవర్ సినిమాలకు ఉంది. బాగీ 3, అంగ్రేజీ మీడియం వంటి చిత్రాల బీమా సమయంలో ఈ కవర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ కవర్ కోవిడ్ తర్వాత ఇవ్వడం లేదు.

‘ఖల్నాయక్’ తో..

ఖల్నాయక్ చిత్రానికి ప్రధాన నటుడు సంజయ్ దత్ అరెస్టు అయినప్పుడు, ఆయన అనేక చిత్రాల షూటింగ్ ఆగిపోయింది. ఉత్పత్తిలో అంతరాయం ఎదురైనప్పుడు భీమా రక్షణ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ మొదటిసారి అర్థం చేసుకున్నారు. ఖల్నాయక్ నిర్మాత సుభాష్ ఘాయ్ తన సినిమాల కోసం 12 కోట్ల బీమా తీసుకున్నారు.

పంపిణీ నష్టం కవర్

ఇది స్వైన్ ఫ్లూ సమయంలో వచ్చింది. 2009 లో, స్వైన్ ఫ్లూ సమయంలో, అనేక చిత్రాల షూటింగ్ విడుదల షెడ్యూల్ దెబ్బతింది. అప్పుడు పంపిణీ నష్ట కవర్ ప్రవేశపెట్టారు. పంపిణీదారుడు సినిమా హక్కులను నిర్మాత నుండి కొనుగోలు చేసినప్పుడు, ఆదాయం అంచనా వేస్తారు. ఒక్కోసారి ప్రకృతి విపత్తు, అల్లర్లు వంటి కారణాల వల్ల, ఈ మొత్తం ఆదాయం వచ్చే అవకాశం కోల్పోతారు. ఇటువంటి సమయంలో ఈ కవర్ ఉపయోగపడేది. కొన్ని సినిమా సన్నివేశాలు, ఏదైనా పాత్ర , సంభాషణలను అభ్యంతరం చెబుతూ కోర్టులో కేసులు వేస్తారు. అటువంటి కారణాల వల్ల, పంపిణీలో అంతరాయం ఏర్పడినప్పుడు బీమా రక్షణ కల్పించారు. అయితే, ఒక సినిమాపై చట్టపరమైన నిషేధం విధించినట్లయితే, ఈ కవర్ అమలు కాదు.

లాక్డౌన్ వంటి కారణాలకు నో..

కోవిడ్ తరువాత, సిబ్బందికి కోవిడ్ చికిత్స వైద్య బీమా పెరిగింది. కానీ ఒక కళాకారుడు కోవిడ్ లేదా లాక్డౌన్ కారణంగా సంక్షోభం కారణంగా షూటింగ్ ఆగిపోతే, దానిపై కవర్ లేదు. ఒక చిత్రం లేదా సీరియల్ షూటింగ్ ముంబై నుండి హైదరాబాద్, మరేదైనా ప్రదేశానికి మారింది. అక్కడ షూటింగ్ నిషేధించినట్లైతే, అలాంటి పరిస్థితిలో బీమా అందుబాటులో ఉండదు. అదేవిధంగా, భారతదేశంపై విధించిన ప్రయాణ నిషేధం కారణంగా ఒక చిత్రం విదేశీ షెడ్యూల్ రద్దు అయినా కూడా బీమా వర్తించదు.
ఒక కళాకారుడికి ప్రమాదం లేదా ఇతర అనారోగ్యం ఉండి దానికారణంగా షూటింగ్ ఆగిపోతే, అప్పుడు బీమా పొందవచ్చు, కాని దానిని ప్యాకేజీలో చేర్చాలనే షరతు కూడా ఉంది. కోవిడ్ కారణంగా ఆర్టిస్ట్ రాలేకపోతే లేదా షూటింగ్ ఆగిపోతే, దానికి కవర్ లేదు. కొన్నిసార్లు ఒక ఆర్టిస్ట్‌ను సినిమా మధ్యలో తొలగిస్తారు. ఇలాంటి కారణాల వల్ల నష్టానికి వ్యతిరేకంగా బీమా లేదు.

టర్మ్ ఇన్సూరెన్స్ వైపే మొగ్గు..

కోవిడ్ ఇబ్బందుల్లో అనేక ప్రొడక్షన్ హౌసెస్ తమ సిబ్బందికి కోవిడ్ సంక్రమణ ప్రమాదాన్ని కవర్ చేయడానికి మెడిక్లైమ్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఒక సిబ్బంది మరణించిన సందర్భంలో, అంతకుముందు నిర్మాతలు అతని కుటుంబానికి ఆర్థిక సహాయం కోసం కొంత మొత్తాన్ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా సొమ్ము అందించే విధానం చేపట్టారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక సంవత్సరం మాత్రమే. ఒకేసారి 50 మందికి ఒక్కొక్కరికి రూ .25 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పొందడంలో, నిర్మాతకు ఖర్చుల భారీ భారం ఉండదు. ఎందుకంటే, ఒక ప్రొడక్షన్ హౌస్ లో సినిమాకి పనిచేసె తారాగణం సాధారణంగా ఆ సినిమా వరకే అక్కడ ఉంటారు. అందువల్ల ఒక సంవత్సరం టర్మ్ ఇన్సూరెన్స్ ఆ సినిమా వరకూ నిర్మాతకు సరిపోతుంది.

Also Read: Ambani and Adani: భారతదేశపు వ్యాపార దిగ్గజం అంబానీ.. అదానీతో గ్రీన్ ఎనర్జీ రంగంలో యుద్ధానికి సిద్ధం అయ్యారా?

Facebook: సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ సరికొత్త రికార్డు..భారీ స్థాయిలో పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్!