Electric Scooter Offer: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. థాయ్‌ల్యాండ్ చెక్కేయండి.. బంపర్ ఆఫర్ మిస్ అవ్వొద్దు..

|

Jul 05, 2023 | 5:00 PM

ఒకాయా ఫాస్ట్ సరీస్ లోని ఎఫ్2టీ, ఎఫ్2బీ మోడళ్లు రూ. లక్షలోపే మీరు కొనుగోలు చేయొచ్చు. ఒకాయా ఫాస్ట్ ఎఫ్2బీ మోడల్ పై రూ. 10,800 తగ్గింపు లభిస్తోంది. ఈ డిస్కౌంట్ పోనూ మీకు ఈ స్కూటర్ కేవలం రూ. 99,950కే లభిస్తోంది. అలాగే ఒకాయా ఫాస్ట్ ఎఫ్2టీ స్కూటర్ పై రూ. 8,500 తగ్గింపు ఉంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్కూటర్ ను కేవలం రూ. 99,400కే దక్కించుకోవచ్చు.

Electric Scooter Offer: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. థాయ్‌ల్యాండ్ చెక్కేయండి.. బంపర్ ఆఫర్ మిస్ అవ్వొద్దు..
Okaya F2b Scooter
Follow us on

ఎలక్ట్రిక్ స్కూటర్ కమ్యూనిటీలో ఒకాయా ఎలక్ట్రిక్ వెహికల్స్ కు మంచి గుర్తింపు ఉంది. దీనిని మరింత పెంచుకునేందుకు, వినియోగదారులకు దగ్గరయ్యేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరి ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు మీరు ఒకాయా క్లాసిక్ ఐక్యూ ప్లస్ స్కూటర్ ను రూ. 74,499కే కొనుగోలు చేయొచ్చు. ఇదొక్కటే కాదండోయ్.. ఈ కంపెనీ ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మాన్ సూన్ పరిమిత కాల ఆఫర్ కూడా ప్రకటించింది. దీనిలో రూ. 5000 వరకూ కచ్చితమైన క్యాష్ బ్యాక్ తో పాటు, రూ. 50,000 విలువతో థాయ్ ల్యాండ్ టూర్ వెళ్లే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ధరలు పెరుగుతాయనుకుంటే..

వాస్తవానికి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరుగుతాయని అందరూ అంచనా వేశారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఫేమ్ 2 సబ్సిడీని 40శాతం నుంచి 15శాతానికి తగ్గించారు. దీంతో అనివార్యంగా వాహనాలు రేట్లు పెరగాల్సి ఉంది. అయితే అంతకన్నా ముందే ఒకాయ అద్భుతమైన తగ్గింపుతో స్కూటర్లను విక్రయానికి ఉంచింది. పలు డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

ఈ స్కూటర్లపై ఆఫర్లు..

ఒకాయా ఫాస్ట్ సిరీస్ స్కూటర్లపై ప్రత్యేకమైన డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. తక్కువ బడ్జెట్లో స్కూటర్లు కావాలనుకొనే వినియోగదారులకు ఇది మంచి అవకాశం అని కంపెనీ పేర్కొంది. ఈ ఫాస్ట్ సరీస్ లోని ఎఫ్2టీ, ఎఫ్2బీ మోడళ్లు రూ. లక్షలోపే మీరు కొనుగోలు చేయొచ్చు. ఒకాయా ఫాస్ట్ ఎఫ్2బీ మోడల్ పై రూ. 10,800 తగ్గింపు లభిస్తోంది. ఈ డిస్కౌంట్ పోనూ మీకు ఈ స్కూటర్ కేవలం రూ. 99,950కే లభిస్తోంది. అలాగే ఒకాయా ఫాస్ట్ ఎఫ్2టీ స్కూటర్ పై రూ. 8,500 తగ్గింపు ఉంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్కూటర్ ను కేవలం రూ. 99,400కే దక్కించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఒకాయా మాన్సూన్ ఆఫర్ ఇదే..

పైన పేర్కొన్న తగ్గింపు ధరలే కాకుండా వర్షాకాల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఒకాయా ప్రకటించింది. ఇది 2023, జూలై 31 వరకూ మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మీరు ఫాస్ట్ సిరీస్ స్కూటర్లను కొనుగోలు చేస్తే దానిపై ఆసక్తికరమైన క్యాష్ బ్యాక్ రివార్డులు కూడా ఇస్తారు. అది రూ. 5,000 వరకూ ఉంటుంది. అంతేకాక రూ. 50,000 విలువ చేసే థాయ్ ల్యాండ్ ట్రిప్ కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది. అంటే రూ. 500 నుంచి రూ. 5000 వరకూ క్యాష్ బ్యాక్ సొంతం చేసుకుంటారు. అలాగే వారిలో కొత్త మంది లక్కీ కస్టమర్లు గ్రాండ్ ప్రైజ్ థాయ్ ల్యాండ్ ట్రిప్ కు చెక్కేస్తారు. నాలుగు రోజుల పాటు అయ్యే ఖర్చు మొత్తాన్ని కంపెనీ భరిస్తుంది.

ఒకాయ ఫాస్ట్ సిరీస్ స్కూటర్ల వివరాలు..

ఒకాయ ఫాస్ట్ సిరీస్ లో ఆకర్షణీయమైన డిజైన్లో ఉంటాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ స్ప్రింగ్‌లతో కూడిన సస్పెన్షన్ సెటప్‌ ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్‌లు ఉంటాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్,స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వెహికల్ ట్రాకింగ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, జియో-ఫెన్సింగ్, కీలెస్ ఆపరేషన్, రిమోట్ ఎనేబుల్, డిసేబుల్, బ్యాటరీ స్టేటస్, రైడ్ అండ్ ట్రిప్ హిస్టరీ , బ్యాటరీ స్టాటిస్టిక్‌ల వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది. ఇక సామర్థ్యం విషయానికి వస్తే ఒకాయా ఫాస్ట్ ఎప్2టీ 1200వాట్ల మోటార్ ను కలిగి ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఎప్2బీ కూడా 1200వాట్ల మోటార్ ను కలిగి ఉంటుంది. రెండింటిలోనూ 2.2kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5-6 గంటలు పడుతుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఒకాయ ఫాస్ట్ ఎఫ్2బీ 70-80 కిమీల రేంజ్ ఇస్తుంది. అదే ఫాస్ట్ ఎఫ్2టీ 80-85 కిమీ పరిధిని కలిగి ఉంది. రెండు గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..