Bank Holidays: డిసెంబర్‌ 22న బ్యాంకులు మూసి ఉంటాయా? ఈ వారంలో బ్యాంకు సెలవులు ఇవే!

Bank Holidays: మీరు సోమవారం డిసెంబర్ 22న బ్యాంకు శాఖకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే ముందుగా RBI సెలవుల జాబితాను తనిఖీ చేయండి. సోమవారం బ్యాంకులు మూసి ఉంటాయి. డిసెంబర్ మిగిలిన రోజుల్లో మీరు ఏదైనా ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పనిని..

Bank Holidays: డిసెంబర్‌ 22న బ్యాంకులు మూసి ఉంటాయా? ఈ వారంలో బ్యాంకు సెలవులు ఇవే!

Updated on: Dec 21, 2025 | 8:44 PM

Bank Holidays: మీరు సోమవారం డిసెంబర్ 22న బ్యాంకు శాఖకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే ముందుగా RBI సెలవుల జాబితాను తనిఖీ చేయండి. సోమవారం బ్యాంకులు మూసి ఉంటాయి. డిసెంబర్ మిగిలిన రోజుల్లో మీరు ఏదైనా ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పనిని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తుంటే ముందుగా సెలవుల జాబితాను తనిఖీ చేయండి. అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు నెల పొడవునా నిరంతరం మూసి ఉంటున్నాయి. డిసెంబర్‌ 22న బ్యాంకులు మూసి ఉండే ప్రాంతాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ బ్యాంకు సెలవు దేశ వ్యాప్తంగా కాదు. సిక్కింలో మాత్రమే. తత్ఫలితంగా, అక్కడ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు శాఖలు మూసి ఉండనున్నాయి. మేఘాలయలోని లోసాంగ్/నామ్సంగ్ అనేది సిక్కిం ప్రధాన సాంప్రదాయ పండుగ. దీనిని లెప్, భూటియా వర్గాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాయి. ఈ పండుగ పంట కాలం ముగింపు, సిక్కిం నూతన సంవత్సర ఆగమనాన్ని సూచిస్తుంది.

ఇది కూడా చదవండి: Traffic Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం?

డిసెంబర్ 2025లో బ్యాంకు సెలవులు:

ఇవి కూడా చదవండి
  • డిసెంబర్ 21 (ఆదివారం) – వారాంతపు సెలవుల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  • డిసెంబర్ 22 (సోమవారం) -లోసంగ్/నామ్సంగ్ పండుగ కారణంగా సిక్కింలో బ్యాంకులు మరోసారి మూసి ఉంటాయి. దీని అర్థం బ్యాంకులు వరుసగా మూడు రోజులు సెలవు.
  • డిసెంబర్ 24 (బుధవారం) – నాగాలాండ్, మేఘాలయ, మిజోరంలు క్రిస్మస్ ఈవ్‌ను సెలవుదినంగా పాటిస్తాయి.
  • డిసెంబర్ 25 (గురువారం) -క్రిస్మస్ రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్ 26 (శుక్రవారం) -నాగాలాండ్, మేఘాలయ, మిజోరంలు క్రిస్మస్ తర్వాత కూడా సెలవు దినంగా పాటిస్తాయి. ఈ రాష్ట్రాల్లోని బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూసి ఉంటాయి.
  • డిసెంబర్ 27 (శనివారం) -ఈ రోజు నెలలో నాల్గవ శనివారం అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.
  • డిసెంబర్ 28 (ఆదివారం) -వారాంతపు సెలవుల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్ 30 (మంగళవారం) -స్వాతంత్ర్య సమరయోధుడు యు క్యాంగ్ నంగ్బా వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
  • డిసెంబర్ 31 (బుధవారం) – మిజోరాం, మణిపూర్‌లలో నూతన సంవత్సర వేడుకలు, ఇమోయిను ఇరత్పా పండుగ సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM సేవలు యథావిధిగా పనిచేస్తాయి. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముఖ్యమైన పనులను ముందుగానే పూర్తి చేయండి.

Indian Railways: రైల్వే ట్రాక్‌లో లూప్‌లైన్‌ అంటే ఏమిటి..? దీన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఇంట్రెస్టింగ్ స్టోరీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి