కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళల కోసం పలు పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. ఆ పథకాలలో ఒకదాని పేరు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. ఇటీవల, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తన వీకెండ్ మీటింగ్‌లో ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు 75 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లను అందించబోతోంది. వచ్చే మూడేళ్లలో మహిళలకు ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. కేబినెట్ ఈ నిర్ణయం తర్వాత దేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరగనుంది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను 2016లో మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం లక్ష్యం పేద, దిగువ ఆదాయ వర్గాలకు చెందిన మహిళలు కూడా ఎల్పీజీ సిలిండర్ ప్రయోజనం పొందవచ్చని.. ఈ పథకం కింద, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) నివసిస్తున్న మహిళలు ఉచిత గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు.
ఉజ్వల 2.0 పథకం కింద దేశవ్యాప్తంగా 75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,650 కోట్ల నిధులను కేటాయించింది. ఈ పథకానికి అయ్యే ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాఖీ, ఓనం సందర్భంగా తక్కువ ధరకే ఎల్‌పీజీ సిలిండర్లను అందజేస్తామని ప్రకటించింది. సాధారణ వినియోగదారుల కోసం ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రూ.200 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రూ.200 కాకుండా.. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన సిలిండర్‌పై అదనంగా రూ.200 తగ్గింపును పొందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పథకం లబ్ధిదారులకు రూ.400 తక్కువ ధరకే సిలిండర్ లభిస్తుంది.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళల కోసం ప్రారంభించబడింది. బీపీఎల్ కార్డు ఉన్నవారు మాత్రమే దీని ప్రయోజనం పొందుతారు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి.. మీరు తప్పనిసరిగా రేషన్ కార్డును కలిగి ఉండాలి. దీనితో పాటు, మీ కుటుంబ ఆదాయం రూ. 27,000 లోపు ఉండాలి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం