Cheapest Mobile Phone: భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత చౌకైన మొబైల్స్‌ ఇవే.. ఫీచర్స్‌, ధర వివరాలు!

Cheapest Mobile Phone: మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ ఫోన్లు విడుదలవుతున్నాయి. అందులో చాలా మంది తక్కువ బడ్జెట్‌లో ఉండే స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. భారతదేశంలో అత్యంత తక్కువ ధరలలో ఉండే స్మార్ట్‌ ఫోన్లు, వాటి ఫీచర్స్‌ గురించి తెలుసుకుందాం..

Cheapest Mobile Phone: భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత చౌకైన మొబైల్స్‌ ఇవే.. ఫీచర్స్‌, ధర వివరాలు!

Updated on: Apr 07, 2025 | 1:44 PM

ప్రజలు బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్‌లను కొనాలనుకుంటున్నారు. కొంతమందికి మంచి స్టోరేజ్ ఉన్న, కొన్ని సంవత్సరాలు బాగా పనిచేసే ఫోన్ కావాలి. చాలా మంది అత్యంత తక్కువ ధరల్లో ఉన్న మొబైల్‌లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఏడు వేల రూపాయల కన్నా తక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

  1. రెడ్‌మి నోట్ 8: Redmi A3X అనేది స్టైలిష్ గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో వచ్చే మొబైల్. ఈ ఫోన్ 6.71 అంగుళాల డిప్‌ప్లే ఉంటుంది.ఈ రెడ్‌మి మొబైల్‌లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వేలిముద్ర, ఫేస్ అన్‌లాక్ వంటి వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ షియోమి స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,199.
  2. మోటరోలా E13: ఈ మోటరోలా ఫోన్ 8 GB RAM+128 GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ మొబైల్ ఫోన్ డిస్‌ప్లే 6.5 అంగుళాలు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూనిసోక్ T606 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో మీకు 13 MP వెనుక కెమెరా, 5 MP ముందు కెమెరా లభిస్తుంది. మోటరోలా e13 ధర రూ.6,999.
  3. శామ్‌సంగ్ గెలాక్సీ F05: Samsung Galaxy F05 4 GB RAM+ 64 GB స్టోరేజ్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 6.74 అంగుళాలు. ఈ మొబైల్‌లో 50 MP ముందు కెమెరా, 8 MP వెనుక కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల భద్రతా అప్‌డేట్స్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శామ్‌సంగ్ ఫోన్ ధర రూ.6,499.
  4. పోకో సి61: POCO C61 6.71 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్‌, ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంది. ఈ మొబైల్ మూడు రంగులలో లభిస్తుంది. నలుపు, తెలుపు, ఆకుపచ్చ. Amazonలో POCO C61 ధర రూ. 5,799.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి