Microsoft: అణుశక్తి వైపు మైక్రోసాఫ్ట్ అడుగులు.. కొత్తగా డైరెక్టర్ నియామకం.. కారణమేంటి?

డేటా సెంటర్లకు అధిక విద్యుత్ నిరంతరాయ విద్యుత్ అవసరం అవుతోంది. సంప్రదాయ పద్ధతుల్లో ఇంత పెద్ద మొత్తంలో నిరంతరాయ విద్యుత్ తయారు చేయడం కష్టతరమవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఓ పరిష్కారాన్ని కనుగొంది. సంప్రదాయ విధానాల్లో విద్యుత్ జనరేషన్ కాకుండా నూక్లియర్ పవర్(అణుశక్తి)ని తయారు చేయాలని ఆలోచన చేస్తోంది. అందుకు కోసం ప్రత్యేకంగా ఓ నూక్లియర్ నిపుణురాలిని నియమించుకుంది.

Microsoft: అణుశక్తి వైపు మైక్రోసాఫ్ట్ అడుగులు.. కొత్తగా డైరెక్టర్ నియామకం.. కారణమేంటి?
Microsoft

Updated on: Jan 28, 2024 | 7:01 AM

టెక్ ఇండస్ట్రీకి డేటా సెంటర్లు చాలా కీలకంగా ఉంటాయి. వీటి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వాటికి మిల్లీ సెకను సమయం కూడా విద్యుత్ సరఫరా ఆగకూడదు. నిరంతర విద్యుత్ అవసరం. ముఖ్యంగా ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విరివిగా వినియోగిస్తున్న సమయంలో ఈ డేటా సెంటర్లకు అధిక విద్యుత్ నిరంతరాయ విద్యుత్ అవసరం అవుతోంది. సంప్రదాయ పద్ధతుల్లో ఇంత పెద్ద మొత్తంలో నిరంతరాయ విద్యుత్ తయారు చేయడం కష్టతరమవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఓ పరిష్కారాన్ని కనుగొంది. సంప్రదాయ విధానాల్లో విద్యుత్ జనరేషన్ కాకుండా నూక్లియర్ పవర్(అణుశక్తి)ని తయారు చేయాలని ఆలోచన చేస్తోంది. అందుకు కోసం ప్రత్యేకంగా ఓ నూక్లియర్ నిపుణురాలిని నియమించుకుంది. కంపెనీ న్యూక్లియర్ స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్లడానికి ఆర్చీ మనోహరన్ అనే నూ క్లియర్ నిపుణురాలిని తీసుకొచ్చింది. ఆయన స్మాల్ స్కేల్ ఆటోమిక్ రియాక్టర్స్ కోసం ప్రొగ్రామ్ చేసి, నియంత్రించేలా టాస్క్ అప్పగించింది. ఈ నూక్లియర్ రియాక్టర్ల ద్వారా భారీ డేటా సెంటర్లకు నిరంతరాయ పవర్ ఇవ్వాలని సూచించింది.

ఎవరీ మనోహరన్..

మైక్రోసాఫ్ట్ నియమించుకున్న నూక్లియర్ నిపుణురాలు అయిన ఆర్చీ మనోహరన్ తన లింక్డ్ ఇన్ ఖాతా ప్రకారం 15 ఏళ్లుగా ఎనర్జీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. తన ఖాతాలో ఈ విషయాన్ని ఆమె పోస్ట్ చేశారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో తాను కొత్త బాధ్యత తీసుకున్నట్లు రాశారు. నూక్లియర్ టెక్నాలజీలో డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన పి. టాడ్ నో, షాన్ జేమ్స్ కు కృతజ్ఞతలు చెప్పారు. తన సహోద్యోగి ఎరిన్ హెండర్ సన్ తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు పోస్ట్ లో వివరించారు.

మైక్రోసాఫ్ట్ ఎనర్జీ స్ట్రాటజీ..

మైక్రోసాఫ్ట్ సంస్థ తన నూక్లియర్ ఎనర్జీ స్ట్రాటజీని బలపరచాలని చూస్తోంది. అందుకోసం గతేడాదే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. సాధారణంగా డేటా సెంటర్లు చాలా విద్యుత్ ను వినియోగిస్తాయి. ఇది కంపెనీ నిర్వహణకు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. అంతేకాక సంప్రదాయ పద్ధతుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే పర్యావరణ కాలుష్యం అధికమవుతోంది. ఈ క్రమంలో గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు కార్బన్ న్యూట్రల్ లక్ష్యాల దిశగా కార్యాచరణను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయని అణుశక్తి విధానంపై కంపెనీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. అయితే ఈ విధానంలో రేడియో ధార్మిక వ్యర్థాల నిర్వహణ, అవసరమైన యురేనియం సరఫరా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..