ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019 జాబితాలో భారత సంతతికి చెందిన.. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెల్ల అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో మాస్టర్ కార్డ్ సిఇఓ అజయ్ బంగా మరియు అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ ఉన్నారు. ఈ ఏడాదికిగాను 20 మందితో విడుదలైన తాజా జాబితాలో ముగ్గురు భారతీయులకు చోటు లభించింది. సాహసోపేత లక్ష్యాలను పరిష్కరించేవారు, అసాధ్యమైన సమస్యలను అధిగమించేవారు, సృజనాత్మక పరిష్కారాలను కనిపెట్టగల సారథులను ప్రపంచవ్యాప్తంగా అన్వేషించి ఫార్చూన్ ఈ జాబితాను తయారు చేసింది. ఈ జాబితాలో 2014 నుండి టెక్నాలజీ దిగ్గజం నాదెల్ల అగ్రస్థానంలో ఉన్నారు. మాస్టర్ కార్డ్ సిఇఓ అజయ్ బంగా 8 వ స్థానంలో ఉండగా, జాబితాలో 18 వ స్థానంలో ఉల్లాల్ నిలిచారు.