
తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన మనీష్ ధమేజా ప్రపంచంలోనే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్న వ్యక్తిగా గిన్నీస్ రికార్డు సాధించాడు. ఏకంగా 1,638 యాక్టివ్ క్రెడిట్ కార్డులతో అతిపెద్ద క్రెడిట్ కార్డ్ యూజర్ గా రికార్డు నెలకొల్పాడు. అయితే క్రెడిట్ కార్డులు కేవలం ఆర్థిక అవసరాల కోసమే కాదని, అవి అంటే తనకెంతో ఇష్టమని చెప్తున్నాడు. “క్రెడిట్ కార్డు నాకు అవసరం మాత్రమే కాదు. అవంటే నాకు తెలియని ఇష్టం. అవి లేకుండా నా జీవితం అసంపూర్ణం. క్రెడిట్ కార్డ్స్ ద్వారా వచ్చే గిఫ్ట్ లు, రివార్డ్ లు చాలా అద్భుతమైనవి” అని మనీష్ చెప్పుకొచ్చాడు.
మనదేశంలో 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు సమయంలో అందరిలాగే మనీష్ కూడా భయాందోళనలకు గురయ్యాడు. ఈ సమయంలోనే మనీష్ క్రెడిట్ కార్డులు వాడడం అలవాటు చేసుకున్నాడు. తన ఖర్చుల కోసం కరెన్సీకి బదులు డిజిటల్ పేమెంట్స్ వాడడం స్టార్ట్ చేశాడు. ఇలా మనీష్ తన క్రెడిట్ కార్డ్ జర్నీని మొదలుపెట్టాడు. ఇక రానురాను క్రెడిట్ కార్డులు తనకు ఆర్థిక స్వేచ్ఛతో పాటు రివార్డులు, ఇతర డిస్కౌంట్లు కూడా అందిస్తుండడంతో క్రెడిట్ కార్డుల సంఖ్యను పెంచుకుంటూ పోయాడు.
మనీష్ కు ట్రావెల్ సమయంలో క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడేవట. రైల్వే విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్, ఫుడ్, స్పా సేవలు, హోటల్ వోచర్లు, ఫ్లైట్ టిక్కెట్స్ లో డస్కౌంట్స్, షాపింగ్ వోచర్లు, సినిమా టిక్కెట్లు, గోల్ఫ్ సెషన్‌లు… ఇలా క్రెడిట్ కార్డ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ పొందేవాడట. ఇలా క్రెడిట్ కార్డ్స్ తో తన బంధాన్ని పెంచుకుంటూ ఏకంగా 1638 కార్డులు తీసుకున్నాడు. దాంతో ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్న వ్యక్తిగా గిన్నీస్ రికార్డులోకి ఎక్కాడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి