EV Bike: మార్కెట్‌లో నయా ఈవీ బైక్ లాంచ్.. మామూలు ‘మేటర్’ కాదుగా..!

భారతదేశంలో ఈవీ వాహనాల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కానీ ఈ రంగంలో ఈవీ స్కూటర్ల అమ్మకాలు మాత్రమే అధికంగా ఉన్నాయి. ఈవీ బైక్స్ పెద్దగా మార్కెట్‌లోకి రిలీజ్ కావడం లేదు. ఈ నేపథ్యంలో ఓ స్టార్టప్ కంపెనీ ఈవీ బైక్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ ఈవీ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

EV Bike: మార్కెట్‌లో నయా ఈవీ బైక్ లాంచ్.. మామూలు ‘మేటర్’ కాదుగా..!
Aera Geared Electric Bike

Updated on: Apr 18, 2025 | 4:45 PM

అహ్మదాబాద్‌కు చెందిన స్టార్టప్ మ్యాటర్ మోటార్స్ బెంగళూరులో మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1.88 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. అయితే ఈ మోటార్ సైకిల్‌ను ఇప్పటికే ప్రీ-బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పరిమిత కాల ఆఫర్ కింద కంపెనీ మొదటి 500 మంది రైడర్లకు రూ.1.79 లక్షల ప్రత్యేక ప్రారంభ ధరకు ఈ బైక్‌ను అందిస్తుంది. ఇందులో రూ.15,000 విలువైన లైఫ్ టైమ్ ఉచిత బ్యాటరీ వ్యారెంటీ కూడా అందిస్తుంది. ఈ కంపెనీ త్వరలో బెంగళూరులో ఒక అనుభవ కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తుంది. అలాగే కస్టమర్లు బైక్‌ను స్వయంగా చూడడానికి, అలాగే టెస్ట్ రైడ్‌లు చేయడానికి కూడా అందుబాటులో ఉంచుతుంది. 

ఏరా మోటార్ సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 5000, 5000 ప్లస్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ దేశంలో గేర్‌బాక్స్‌తో వచ్చే ఏకైక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌గా ఉండనుంది. ఈ బైక్ లిక్విడ్-కూల్డ్ ఈ-మోటార్‌తో జత చేసి 4-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ స్థిర 5 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే 125 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే నావిగేషన్, రైడ్ డేటా, కాల్స్, మ్యూజిక్, మరిన్నింటిని ప్రదర్శించే ఏడు అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. అలాగే ఓటీఏ అప్‌డేట్స్‌తో అనుసంధానించిన సాంకేతికతను కూడా పొందుతుంది. రియల్-టైమ్ బైక్ డేటా, రిమోట్ లాక్ సామర్థ్యాలు, జియో-ఫెన్సింగ్, సర్వీస్ హెచ్చరికలను చూపించే మొబైల్ యాప్ కూడా ఉంది. 

ఏరా బైక్ డ్యూయల్ డిస్క్ బ్రేక్లు, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యూయల్ రియర్ సస్పెన్షన్‌తో ఆకట్టుకుంటుంది. అలాగే బ్యాటరీ ప్యాక్ మూడు సంవత్సరాల వారంటీతో ప్రామాణికంగా వస్తుందని కంపెనీ చెబుతుంది. అంటే కేవలం 25 పైసలకే కిలోమీటర్ ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బెంగళూరు తర్వాత ఇతర కీలకమైన భారతీయ నగరాల్లో ఏరాను దశలవారీగా విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ బైక్ రిలీజ్‌పై మ్యాటర్  వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ మోహల్ లాల్బాయ్ మాట్లాడుతూ ఈ బైక్స్ కోసం బెంగళూరు కంటే మెరుగైన నగరం మరొకటి లేదని చెబుతున్నారు. ఏరా పని తీరు కచ్చితంగా రైడర్లను ఆకర్షిస్తుందని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..