Baleno Regal: దుమ్మురేపుతున్న బాలినో రిగాల్ నయా ఎడిషన్.. లుక్ అదిరిందిగా..!

|

Oct 22, 2024 | 4:10 PM

దేశంలో ఫెస్టివల్ సీజన్ జోష్ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులతో కలసి అందరూ సంబరాలు చేసుకొంటున్నారు. త్వరలో దీపావళి పండగ రానుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడంలో బీజీగా మారారు. పండగ సందర్భంగా కొత్త వస్తువులను ఇంటికి తీసుకురావడం భారతీయుల ఆనవాయితీ. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను, కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

Baleno Regal: దుమ్మురేపుతున్న బాలినో రిగాల్ నయా ఎడిషన్.. లుక్ అదిరిందిగా..!
Baleno Regal
Follow us on

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన ఖాతాాదారులకు శుభవార్త చెప్పింది. అందరికీ ఎంతో ఇష్టమైన బాలెనో రీగల్ ఎడిషన్ కారును విడుదల చేసింది. ఫెస్టివల్ సీజన్ లో విక్రయాలను పెంచుకోవడానికి మారుతీ కంపెనీ చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా బాలెనో రీగల్ ఎడిషన్ ను విడుదల చేసింది. ఈ లిమిటెడ్ రన్ స్పెషల్ ఎడిషన్ మోడల్ ప్రీమియం హ్యచ్ బ్యాక్ అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది. బాలెనో జనరల్ మోడల్ కు భిన్నంగా ఈ కారులో అనేక అప్ డేట్లు చేసింది. దాదాపు రూ.60 వేలు విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీలు కూాడా అందిస్తోంది. అన్ని ప్రీమియం హ్యచ్ బ్యాక్ ట్రిమ్ లలో బాలెనో రీగల్ ఎడిషనల్ అందుబాటులో ఉంది. సిగ్మా ట్రిమ్ రూ.60,199, డెల్టా ట్రిమ్ రూ.49,990, జీటా ట్రిమ్ రూ.50,428, ఆల్పా ట్రిమ్ రూ.45,829 విలువైన యాక్సెసరీలు అందిస్తున్నారు.

మారుతీ సుజుకీ రీగల్ ఎడిషన్ లో గ్రిల్ అప్పర్ గార్నిష్, ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, రియర్ అండర్ బాడీ స్పాయిలర్, బ్యాక్ డోర్ గార్నిష్, బాడ్ సైడ్ మోల్డింగ్, డోర్ వైజర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కారు లోపల భాగంలో ఆల్ వెదర్ మ్యాట్లు, విండో కర్టెన్లు, ఇంటీరియర్ స్లైలింగ్ కిట్, కొత్త సీట్ కవర్లు, బూట్ మ్యాట్, స్టీరింగ్ కవర్ తదితర ఉపకరణాలను ఏర్పాటు చేశారు. మారుతీ కొత్త కారులో అనేక ప్రత్యేక ఫీచర్లు ఏర్పాటు చేశారు. వాటిలో టాప్ స్పెక్ ఆల్పా ట్రిమ్ 360 సరౌండ్ వ్యూ కెమెరా, హెడ్స్ అప్ డిస్ ప్లే, ఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ డీఆర్ ఎల్, రియర్ వ్యూ మిర్రర్ లోపల ఆటో డిమ్మింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఉన్నాయి. 

బాలెనో రీగల్ ఎడిషన్ లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 88 హెచ్ పీ, 113 ఎన్ ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. ఐదు స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో లభిస్తుంది. దీనిలో సీఎన్ జీ డెరివేటివ్ కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడల్ మాదిరిగానే అదే ఇంజిన్ ను ఉపయోగిస్తుంది. అయితే సీఎన్ జీతో నడిచినప్పుడు పవర్ అవుట్ పుట్ 76 హెచ్‌పీకి తగ్గుతుంది. గరిష్ట టార్క్ 98.5 మాత్రమే ఉత్పత్తి అవుతుంది. మారుతీ సుజుకీ బాలెనో రీగల్ ఎడిషన్ దేశంలో రూ.8.40 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఏఎంటీ గేర్ బాక్స్ తో కూడిన టాప్ స్పెక్ ఆల్పా ట్రిమ్ కోసం రూ.9.83 లక్షలు ఖర్చు చేయాలి. ప్రస్తుతం ప్రీ బుక్కింగులు మొదలయ్యాయి. కంపెనీ వెట్ సైట్ లో గానీ, దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద గానీ బుక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..