Two Wheeler Sales: మార్చి నెలలో భారీగా పెరిగిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు.. ప్రజలు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు

|

Apr 02, 2021 | 1:50 PM

Two Wheeler Sales: కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న తరుణంలో ప్రజలు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో వాహనాలకు భారీ డిమాండ్‌ పెరిగింది...

Two Wheeler Sales: మార్చి నెలలో  భారీగా పెరిగిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు.. ప్రజలు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు
Two Wheeler Sales
Follow us on

Two Wheeler Sales: కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న తరుణంలో ప్రజలు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో వాహనాలకు భారీ డిమాండ్‌ పెరిగింది. మారుతీ సుజుకీ, హ్యుండయ్‌, టాటా మోటార్స్‌ సహా అన్ని కంపెనీలకు మార్చి నెల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని మోదు చేశాయి. అయితే భారీ అమ్మకాలు సాగినట్లు ప్రకటించిన కంపెనీల్లో టాయోటా కిర్లోస్కర్‌ మోటారు, హోండా కార్స్‌, మహీంద్రా ఉన్నాయి. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి దేశంలో బీఎస్‌-6 కాలుష్య ప్రమాణాలు అమలు పర్చడం, మరోపక్క కరోనా కాలంలో సుదీర్ఘంగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌తో ఉత్పత్తి నిలిచిపోవడంతో డిమాండ్‌కు తగినట్లుగా కంపెనీలు సరఫరా పెంచలేకపోతున్నాయి.

అయితే భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ మార్చి నెలలో దేశీయ అమ్మకాల్లో 72 శాతం పెరిగి 576,957 యూనిట్లుగా నమోదైంది. గత ఏడాది మార్చిలో 316,685 యూనిట్లు విక్రయాలు కొనసాగాయి. కంపెనీ ఎగుమతులు 32,617 వద్ద ఉన్నాయి, ఈ నెలలో 82 వృద్ధి నమోదు చేశాయి.

ఇక దేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మార్చిలో 395,037 యూనిట్ల అమ్మకాలను సాధించింది. గత ఏడాది మార్చిలో అమ్మిన 222,325 యూనిట్లతో పోలిస్తే ఇది 78 శాతం పెరిగింది. ఈ నెలలో హోండా ఎగుమతులు 16,000 యూనిట్ల వద్ద ఉంది.

ఇక దేశంలో మూడవ అతిపెద్ద ద్విచక్ర వాహన అమ్మకందారులైన చెన్నైకి చెందిన టీవీఎస్‌ మోటార్ కంపెనీ మార్చిలో దేశీయ అమ్మకాలలో 115 శాతం పెరిగి 202,155 యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో 94,103 యూనిట్లు జరిగాయి. ద్విచక్ర వాహనాల ఎగుమతులు 164 శాతం పెరిగి 105,282 యూనిట్లకు చేరుకున్నాయి.

అలాగే బజాజ్ ఆటో మార్చిలో దేశీయ అమ్మకాలలో 84 శాతం పెరిగి 181,393 యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో 98,412 యూనిట్లు అమ్ముడయ్యాయి. ద్విచక్ర వాహనాల ఎగుమతులు 148,740 యూనిట్లుగా ఉన్నాయి, ఇది 32 శాతం పెరిగింది. అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్చిలో దేశీయ అమ్మకాలలో 84 శాతం పెరిగి 60,173 యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది మార్చిలో 32,630 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మార్చిలో దేశీయ అమ్మకాలు 60,222 గా నమోదయ్యాయి. గత ఏడాది మార్చిలో 33,930 అమ్మకాలతో పోలిస్తే ఇది 77 శాతం వృద్ధిని సాధించింది. సుజుకి ఎగుమతులు 45 శాతం పెరిగి 9,720 యూనిట్లకు చేరుకున్నాయి.

ఇవీ చదవండి: Honda Vehicles Recalls : ఏకంగా 7,61,000 వాహనాలు వెనక్కి రప్పించిన హోండా కంపెనీ.. కారణం ఏమిటంటే..?

Gold Price Today: బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Post Office Deposit: పోస్టాఫీసులో అదిరిపోయే డిపాజిట్‌ పథకం.. నెలకు 1000 డిపాజిట్‌ చేస్తే రూ.72 వేలు వడ్డీ పొందవచ్చు.. ఎలాగంటే..!