Today Silver Price: భారీగా తగ్గుముఖం పట్టిన వెండి ధర.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు.. తాజాగా ఎంత తగ్గిందంటే..

Today Silver Price: ఒక వైపు దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతుంటే.. అదే దారిలో వెండి కూడా పయనిస్తోంది. రోజురోజుకు బంగారం ,వెండి ధరలు ..

Today Silver Price: భారీగా తగ్గుముఖం పట్టిన వెండి ధర.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు.. తాజాగా ఎంత తగ్గిందంటే..

Updated on: Mar 05, 2021 | 6:16 AM

Today Silver Price: ఒక వైపు దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతుంటే.. అదే దారిలో వెండి కూడా పయనిస్తోంది. రోజురోజుకు బంగారం ,వెండి ధరలు తగ్గుతుండటంతో జనాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ కారణాల వల్ల బంగారం, వెండి ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి రూ.1700 మేర తగ్గుముఖం పట్టింది.

దేశంలో ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,200 ఉండగా, ముంబైలో రూ. 66,200 ఉంది. చెన్నైలో రూ.70,400, బెంగళూరులో రూ.67,600, కోల్‌కతాలో రూ.66,200 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,400 ఉండగా, విజయవాడలో రూ.70,400వద్ద కొనసాగుతోంది.

కాగా, దేశంలోని బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Gold Price: రూ.40వేల దిగువకు బంగారం..? పసిడి ధరలు ఎందుకు క్షీణిస్తున్నాయి.. ఏడు నెలల్లో రూ.12వేలకుపైగా తగ్గిన పుత్తడి ధర